వైట్ వాష్ గండం తప్పేనా ? పరువు కోసం భారత్ పోరాటం

సొంతగడ్డపై తొలిసారి పరువు కోసం భారత క్రికెట్ జట్టు పాకులాడుతోంది. ఊహించని విధంగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఇప్పుడు వైట్ వాష్ గండం పొంచి ఉంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరిగే చివరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2024 | 12:19 PMLast Updated on: Oct 30, 2024 | 12:19 PM

Is White Wash Wrong Indias Fight For Dignity

సొంతగడ్డపై తొలిసారి పరువు కోసం భారత క్రికెట్ జట్టు పాకులాడుతోంది. ఊహించని విధంగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఇప్పుడు వైట్ వాష్ గండం పొంచి ఉంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరిగే చివరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఒకవేళ ఈ టెస్టులోనూ కివీస్ గెలిస్తే సొంత గడ్డపై 24 ఏళ్ళ తర్వాత వైట్ వాష్ పరాభవం ఎదురవుతుంది. ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు ఇంతకంటే ఘోరమైన పరాభవం మరొకటి ఉండదు. బెంగళూరు టెస్టులో కేవలం 46 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటై ఇప్పటికే నవ్వులపాలైన భారత్ టెస్టు జట్టు.. పుణె టెస్టులోనూ చేతులెత్తేసి సిరీస్‌ను చేజార్చుకుంది. కనీసం నామమాత్రమైన ఆఖరి టెస్టులోనైనా గెలవలేకుంటే వైట్‌వాష్ చేదు అనుభవం తప్పదు.

వాస్తవానికి గత 69 ఏళ్లుగా భారత్ గడ్డపై టెస్టులు ఆడుతున్న న్యూజిలాండ్ టీమ్ ఇప్పటి వరకు గెలిచింది 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే. ఇందులో రెండు మ్యాచ్‌లను దాదాపు 36 ఏళ్ల తర్వాత.. అది కూడా 15 రోజుల వ్యవధిలోనే గెలిచింది. కాగా భారత్ గడ్డపై టీమిండియా టెస్టుల్లో చివరిగా 2000 సంవత్సరంలో వైట్‌వాష్‌ను చవిచూసింది. అప్పట్లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని భారత్ జట్టు 0-2తో దక్షిణాఫ్రికాకి సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత ఈ 24 ఏళ్లలో టీమిండియాకు వైట్ వాష్ గండం రాలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ రూపంలో పొంచి ఉంది.

సొంత గడ్డపై ఇప్పటి వరకు 17 సార్లు మాత్రమే టీమిండియా టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. 1933లో తొలిసారి ఇంగ్లాండ్‌కి టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఆ జట్ట చేతిలోనే మరో 4 సార్లు, వెస్టిండీస్‌కి ఐదు సార్లు, ఆస్ట్రేలియాకి 4 సార్లు, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాకి ఒక్కోసారి టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ ఏడాది న్యూజిలాండ్‌కి చేజార్చుకుంది. ఇదిలా ఉంటే 2012-13లో చివరిగా 2012-13లో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత్..ఆ తర్వాత ఈ 12 ఏళ్లలో వరుసగా 18 టెస్టు సిరీస్ గెలిచింది. అయితే ఈ జైత్రయాత్రకు న్యూజిలాండ్‌బ్రేక్ వేసింది. అదే సమయంలో వైట్ వాష్ చేసేందుకు కూడా ఎదురుచూస్తున్న వేళ రోహిత్ సేన ఎంతవరకూ వారి జోరుకు బ్రేక్ వేస్తుందనేది చూడాలి.