isha-ambani : ఇషా అంబానీ శారీ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే
ప్రపంచ కుబేరుడి కూతురు వనకన్యగా మారిపోయింది. మాములుగానే ఈవెంట్స్ కే జిగేల్ మంటూ మెరిసిపోతుంటారుఈ ఫ్యామిలీ మెంబర్. ఇక ప్రతిష్మాత్మక స్టేజ్ లపై దేవకన్యలను తలపిస్తారు. రీసెంట్ గా ముఖేష్ అంబానీ కూతురు ఇషాఅంబానీ ఒక్క డ్రస్.. ఒకే ఒక్క డ్రెస్ తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
ప్రపంచ కుబేరుడి కూతురు వనకన్యగా మారిపోయింది. మాములుగానే ఈవెంట్స్ కే జిగేల్ మంటూ మెరిసిపోతుంటారుఈ ఫ్యామిలీ మెంబర్. ఇక ప్రతిష్మాత్మక స్టేజ్ లపై దేవకన్యలను తలపిస్తారు. రీసెంట్ గా ముఖేష్ అంబానీ కూతురు ఇషాఅంబానీ ఒక్క డ్రస్.. ఒకే ఒక్క డ్రెస్ తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. వందమందికి పైగా కలిసి తయారు చేసిన ఆ డ్రెస్ లో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే వావ్ అనేస్తారు. ఆరు గజాల 3డీ గౌనుకు కార్సెట్ బ్లౌజ్‌తో గ్లామర్ లుక్‌ను మరింత ఎలివేట్ చేసుకుంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెట్ గాలా 2024 ఈవెంట్ లో కస్టమ్ మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీర గౌనులో ఇషా అంబానీ తళుక్కుమంది .గార్డెన్ ఆఫ్ టైమ్ థీమ్ తో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ లో ఇషా శారీ ఫ్రాక్ లో గార్జియస్ లుక్ లో కనిపించి మతులు పొగొట్టింది. పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగల సిగ్నేచర్ మోటిఫ్‌లతో తయానైన గౌనులో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది ఇషా అంబానీ. పూర్తిగా నేచర్ థీమ్‌తో చేసిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్ బ్యాగ్‌తో వన దేవతలా కనిపించింది అంబానీ డాటర్. ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్ర దాన్ని తయారు చేసిన ఈ ఫ్రాక్ కి సంబంధించి ఆసక్తికర విషయం బయటపెట్టగా వైరల్ గా మారింది.
ఇషా అంబానీ వేసుకున్న ఆ ఫ్రాక్ శారీ డిజైన్ చేసేందుకు పదివేల గంటలు పట్టిందట డిజైనర్‌కు. స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియాతో కలిసి దీన్ని రూపొందించినట్లు చెప్పారు. నేచర్ లైఫ్ సైకిల్ ని క్యాప్చర్ చేసే విధంగా దీన్ని తయారు చేశారు. ఒక గార్డెన్‌లో రకరకాల పూల మొక్కలు మొలుస్తాయి, పూలు వికసిస్తాయి.. ఆ తర్వాత వాడిపోతాయి. ఆ లైఫ్ జర్నీనే ఈ డ్రెస్ లో హైలైట్ చేసినట్లు చెప్పుకొచ్చారు .అందుకే ఇషా వేసుకున్న ఫ్రాక్ కి ‘రివర్ ఆఫ్ లైఫ్’ అని టైటిల్ ను పెట్టగా… మిశ్రా పాత డిజైన్స్‌ను షో కేస్ చేస్తూ దీన్ని తయారు చేశారు. అంతేకాక లైట్ షిమ్మరీ బేస్ మీద ట్రెడ్ ఎంబ్రాయిడరీతో, రిచ్ సప్లిమెంటెడ్ మెటీరియల్స్ అయిన రిచ్ రైన్ స్టోన్స్, సీక్విన్స్, బగల్ బీడ్స్, ఝరీ, కుంధన్ లాంటి ఎన్నో మెటిరియల్స్ దీంట్లో వాడినట్లు చెప్పుకొచ్చారు .అంతేకాక ఏన్షియంట్ టెక్నిక్స్ అయిన ఎంబ్రాయిడరీ, ఫరీష, జర్దోజీ, నక్షి, దబ్కా, ఫ్రెంచ్ నాట్స్ లాంటివి కూడా ఉపయోగించి ఈ ఫ్రాక్ తయారు చేసినట్లు తన వర్క్ గురించి బయట పెట్టారు డిజైనర్.
ఈ గౌన్ ని ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేశారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. దీంతో దేశంలోని వివిధ గ్రామాలకు చెందిన కళాకారులను పిలిపించి వర్క్ చేయించారు. దీంతో వందలాది మందికి ఎంప్లాయిమెంట్ కల్పించినట్లు అయ్యింది. దీంతో కేవలం ఆ డ్రెస్ లో ఆమె అందంగా కనిపించడమే కాదు. మన దేశ కళను, గొప్పతనాన్ని అక్కడ చూపించేలా చేసింది. మన దేశ కళాకారుల టాలెంట్ ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇండియన్ ఫ్యాషన్ గ్లోబల్ స్టేజ్ మీద మెరిసిపోయింది.