K.L.Rahul:రాహుల్ భయ్యా నువ్ రెస్ట్ తీసుకో
గాయం నుంచి కోల్కోలేని కారణంగా కేఎల్ రాహుల్ ను మరిన్ని మ్యాచ్ లకు దూరం పెట్టే అవకాశం కనిపిస్తుంది.

Ishan Kishan has replaced KL Rahul as the wicket keeper for Team India
ఆసియా కప్‌లో భారత్ ఆడే తొలి 2 మ్యాచ్‌లకు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమవడంతో.. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రంగంలోకి దిగాడు. వేరే అప్షన్ లేక ఇషాన్‌ని తీసుకోగా.. పాక్‌పై జరిగిన మ్యాచ్‌లో అతనే జట్టుకు అండ అయ్యాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచి 82 పరుగులతో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ధోని రికార్డుపై తన పేరు లిఖించుకున్నాడు. ఇంకా ధోనికి చెందిన మరో రెండు రికార్డులను సమం చేశాడు. ఈ క్రమంలోనే ఇషాన్.. టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
ఆసియా కప్ లో పాక్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ నిలిచాడు. అంతకముందు ధోని 76 పరుగులతో ఈ రికార్డ్‌ని కలిగి ఉండగా.. పాక్‌పై తాజాగా 82 పరుగులు చేసిన ఇషాన్ ‘ధోని’ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అలాగే వన్డేల్లో వరుసగా 4 అర్ధ సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా కూడా ఇషాన్ ధోనిని సమం చేశాడు. 2011లో ఇంగ్లాండ్‌పై ధోని వరుసగా 4 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఇటీవలే విండీస్‌పై జరిగిన 3 వన్డేల్లోనూ హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్, తాజాగా పాక్‌పై అదే ఫీట్ కొనసాగించాడు. కాగా, భారత్-పాక్ మ్యాచ్‌లో వరుణుడిదే పైచేయి అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 266 పరుగులకు ఆలౌట్ కాగా, వర్షం కారణంగా పాక్‌కి బ్యాటింగ్ అవకాశం రాలేదు. సమయం గడుస్తున్నా వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేసి, ఇరుజట్లకు చెరో పాయింట్ ఇస్తున్నట్లుగా అంపైర్లు నిర్ణయించారు. అప్పటికే నేపాల్‌పై సాధించిన పాక్ మొత్తం 3 పాయింట్లతో సూపర్ 4 దశకు చేరింది.