IT Industry: ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి వరంగా మారిన ఇజ్రాయెల్ – హమాస్ యుద్దం.. ఎందుకో తెలుసా..?

ఇండియన్ ఐటీ కంపెనీలకు అదృష్టం తలుపు తడుతుందని చెప్పాలి. దీనికి కారణం మాత్రం ఇజ్రాయెల్ - హమాస్ యుద్దం. ఒకరికి శాపం మరొకరికి వరంగా మారింది. అక్కడి టెక్కీలు తమ సొంత దేశాలకు తిరుగుపయనమౌతున్న తరుణంలో ఐటీ ప్రాజెక్టులు ఇండియాకు అందించాలని భావస్తున్నాయి కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2023 | 02:40 PMLast Updated on: Oct 12, 2023 | 2:40 PM

Israels War With Hamas Has Become A Boon For Indias It Industry

ప్రస్తుతం ఇజ్రాయెల్ – హమాస్ పేరు చెబితే చాలు భీకరమైన యుద్దపు సన్నివేశాలు గుర్తుకొస్తాయి. అలా తయారైంది ప్రస్తుతం ఆ దేశం పరిస్థితి. దీని తీవ్రతతో సుమారు 3000 వేల మంది చనిపోయినట్లు చెబుతున్నాయి అక్కడి మాధ్యమాలు. అయితే అధికారికంగా ఖచ్చితమైన లెక్కలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఇక దీని ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడింది. సాధారణంగా సాంకేతికత అంటేనే ఇజ్రాయిల్ పెట్టింది పేరుగా చెబుతారు. దీనికి ఉదాహరణే గతంలో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఇక్కడ కనుగొనబడిందే. దీని ప్రభావంతో వివిధ దేశాల్లోని పార్లమెంట్లు ఉలిక్కిపడ్డాయి. అంతటి సాంకేతిక సామర్థ్యం ఇజ్రాయెల్ సొంతం. అలాంటి ఈ దేశంలో ఐటీ పరిశ్రమకు ప్రస్తుతం గడ్డుకాలం అని చెప్పక తప్పదు.

తిరుగుపయనమౌతున్న టెక్కీలు..

ప్రస్తుతం ఇజ్రాయెల్ లో జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడ పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తమ సొంత ఊళ్ల కు పయనం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా అక్కడి పరిస్థితుల ప్రభావం కమ్యూనికేషన్ నెట్వర్క్ పై పడింది. దీంతో ఐటీ రంగం కుదేలవుతోంది. తమ కంపెనీలకు సెక్యూరిటీ లేదని భావించిన ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, యూకే, చైనా, ఫ్రాన్స్ తో పాటూ ఇండియాకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అక్కడి ప్రాజెక్టులు వదిలేసి తిరుగుపయనం అవుతున్నారు. దీంతో ఉద్యోగుల విషయంలో కంపెనీలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇండియా వైపు చూస్తున్న ఐటీ ఇండస్ట్రీ..

ఈ క్రమంలో ఐటీ ప్రాజెక్టులన్నీ ఇండియాకు తరలించాలని కొన్ని కంపెనీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పైగా ఉద్యోగులు కూడా తమ ప్రాజెక్టులను ఇండియాకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ కి మొత్తం దేశ ఆదాయంలో 14శాతం వాటా ఈ ఐటీ పరిశ్రమల వల్లే వస్తోంది. దీనిని వదులుకుంటే రానున్న కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని భావిస్తోంది ఆ ప్రభుత్వం. పైగా భవిష్యత్తులో ప్రాజెక్టులు ఇవ్వాలని భావించిన కంపెనీలు కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఇండియాకు అదృష్టంగా మారింది. ముందే మన దేశంలో తాజాగా వెల్లడైన సర్వేలో ఐటీ రంగం గత త్రైమాసికానికంటే కూడా క్షీణతలో ఉందని తేలింది. దీంతో అక్కడి కంపెనీలు ఈ ఆలోచన చేయడం భారత్ కి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు టెక్ నిపుణులు.

నిరుద్యోగులకు వరం..

ఈ యద్దం ప్రభావం ప్రస్తుతం చల్లారేలా లేదు. దీని కారణంగా పరిశ్రమలు అక్కడ మూతపడక తప్పదు. పైగా అక్కడి స్టాక్, బాండ్ల విలువ అమాంతం పడిపోయాయి. దీంతో కంపెనీల విలువ కూడా పడిపోతుంది. అందుకే భారత్ లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడి కంపెనీలకు ప్రాజక్టులు అప్పగించడం వల్ల తమ కంపెనీ షేర్ల విలువను పెంచుకోవచ్చు. పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చు అని భావిస్తున్నాయి ఐటీ సంస్థలు. ఇదే గనుక జరిగితే దాదాపు కొత్తగా 15 నుంచి 20 వేల మంది ఐటీ ఉద్యోగులకు కొత్తగా ఉపాధి లభించే అవకాశం ఉంది. దీంతో కొంత నిరుద్యోగ సమస్య సర్థుమణిగే ఆస్కారం ఉందంటున్నారు ఐటీ నిపుణులు.

T.V.SRIKAR