Mission Aditya: ఆదిత్య మిషన్ ప్రకటించిన ఇస్రో.. ఇక సూర్యుడి వంతు..
చంద్రయాన్3 సక్సెస్ అయ్యింది. చంద్రుడి దక్షిణదృవంపై విక్రమ్ ల్యాండ్ సేఫ్‌గా ల్యాండి అయ్యింది. ఇప్పుడు ఆదిత్య మిషన్ ను కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది.
చంద్రయాన్3 సక్సెస్ అయ్యింది. చంద్రుడి దక్షిణదృవంపై విక్రమ్ ల్యాండ్ సేఫ్‌గా ల్యాండి అయ్యింది. 14 రోజులపాటు ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై పరిశోధన జరపనుంది. ఇస్రో సాధించిన ఈ ఘటన ఇక్కడితో ఐపోలేదు. ఈ విజయ ప్రస్థానం ఇక్కడితో ముగిసిపోలేదు. చంద్రున్ణి చేరుకున్న ఊపులో సూర్యున్ని కూడా టార్గెట్ చేసింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సెప్టెంబర్‌లో సన్ మిషన్ ఆదిత్య ఎల్-1ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. 2008లో ఆలోచనగా మొదలైన ఆదిత్య మిషన్ 2016లో కార్యరూపం దాల్చి ఇప్పుడు లాంచింగ్‌కు రెడీ అవుతోంది. సూర్యుడి గురించి స్టడీ చేయబోయే మొదటి స్పేస్ మిషన్ ఇది. స్పేస్ షిప్‌ను భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 లోని కక్షలో ప్రవేశపెట్టబోతోంది ఇస్రో. ఈ శాటిలైట్ సోలార్ సిస్టమ్‌ను, రియల్‌టైంలో అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని గమనిస్తూ ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపిస్తుంది. మొత్తం ఏడు పేలోడ్‌లను ఆదిత్య ఎల్-1లో పంపబోతోంది ఇస్రో.
విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావయోలేట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ సోలార్ ఎక్స్‌పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్. ఇవి ఆదిత్య ఎల్-1లో సూర్యుడి వద్దకు వెళ్లబోతున్న పేలోడ్స్. ఇందులో నాలుగు పేలోడ్‌లు సూర్యున్ని నేరుగా పర్యవేక్షిస్తాయి. మరో మూడు పేలోడ్‌లు లాగ్రాంజ్ పాయింట్ L1 వద్ద కణాలు క్షేత్రాల ఇన్-సిటు అధ్యయనాలను నిర్వహిస్తాయి. వీటి ద్వారా సోలార్ డైనమిక్స్ యొక్క ముఖ్యమైన, శాస్త్రీయమైన సమాచారం లభిస్తుంది.
ఈ పేలోడ్‌లను సూర్యుడి కక్షలో ఉండే ఉష్ణోగ్రతను అక్కడి వాతావరణాన్ని తట్టుకునేలా డిజైన్ చేశారు. సూర్యుడి కక్ష్యలోని క్రోమోస్పియర్, కరోనా డైనమిక్స్‌ను అధ్యయనం చేయడమే ఆదిత్య మిషన్ ప్రధాన లక్ష్యం. 378 కోట్లతో చేపడుతున్న ఈ మిషన్ సూర్యుడిపై పరిస్థితిని అధ్యయనం చేయడంలో అత్యంత కీలకం. సూర్యుడి ఎగువ దిగువ వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో మార్పులు, సూర్యుడి రేడియేషన్ భూ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశాలపై ఈ మిషన్ పని చేస్తుంది. సోలార్ సిస్టమ్‌లోని ఒక లేయర్ నుంచి మరో లేయర్‌కు ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది అనే విషయాలను ఫొటోలతో సహా పంపుతుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే ఇండియా ప్రపంచంలో అగ్రదేశంగా ఎదగడం పక్కా.