GSLV-F14: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగం విజయవంతం..
ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా నింగిలోకి మోసుకెళ్లింది. ఏపీ, శ్రీహరికోటలోని సతీష ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 05:35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ నౌకను ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించింది.

GSLV-F14: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా నింగిలోకి మోసుకెళ్లింది. ఏపీ, శ్రీహరికోటలోని సతీష ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 05:35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ నౌకను ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ నౌక తీసుకెళ్లిన ఇన్‌శాట్ ఉపగ్రహం బరువు 2,275 కిలోలు. ఈ ఉపగ్రహాన్ని నౌక.. నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Yashasvi Jaiswal: రాజ్‌కోట్ టెస్టులో జైస్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యంతో పట్టుబిగించిన భారత్
దీనికి సంబంధించి శనివారం మధ్యాహ్నం నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 27 గంటల ముప్పై నిమిషాలపాటు కొనసాగగా, శనివారం సాయంత్రం రాకెట్ ప్రయోగించింది ఇస్రో. దశలవారీగా రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లిందని, పేలోడ్ విడిపోయిందని ఇస్రో వెల్లడించింది. ఈ ఉపగ్రహం.. అత్యాధునిక సాంకేతికతతో పని చేస్తుంది. వాతావరణం, తుపానులు, వర్షాభావ పరిస్థితులు, విపత్తులు, మేఘాల గమనాలు, సముద్ర ఉపరితల మార్పులు వంటి అంశాలపై సమాచారాన్ని అందిస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. తుఫానులు, భూకంపాలు, సునామీలు వంటి వాటిని గురించి కూడా ఈ ఉపగ్రహం హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, ఈ మిషన్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ తన అభినందనలు అని సోమనాథ్ వ్యాఖ్యానించారు.
అనుకున్న విధంగానే కక్ష్యలోకి దూసుకెళ్లిందని ప్రకటించారు. ఈ ఉపగ్రహం దాదాపు పదేళ్లపాటు సేవలందిస్తుంది. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్-3డీ, ఇన్‌శాట్-3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగా తాజా ఉపగ్రహన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే సేవలందిస్తున్న ఈ ఉపగ్రహాలతోపాటే ఇది కూడా పని చేయనుంది.
#WATCH | Andhra Pradesh: ISRO launched INSAT-3DS meteorological satellite onboard a Geosynchronous Launch Vehicle F14 (GSLV-F14), from Satish Dhawan Space Centre in Sriharikota.
(Source: ISRO) pic.twitter.com/abjPVJWkxh
— ANI (@ANI) February 17, 2024