Chandrayaan3: జాబిల్లిపై సేదతీరుతున్న రోవర్, ల్యాండర్.. ఎందుకోతెలుసా..?
చంద్రయాన్ 3 ద్వారా విక్రమ్ ల్యాండర్, రోవర్ ని చంద్రమండలంపైకి పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇది అక్కడి వాతావరణ పరిస్థితుల మొదలు కీలకమైన ముడి పదార్థాలు, నీటి జాడలను కనుగొంది. దీంతో తన 14 రోజుల ప్రాయాన్ని కోల్పోతుంది. అందుకే స్లీప్ మోడ్ లోకి వెళ్లింది. అయితే తిరిగి ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
చంద్రయాన్3 ఈ ప్రయోగం ప్రపంచ దేశాల చూపు మన వైపుకు తిప్పుకునేలా చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టి ఎన్నో విజయాల సాధించింది. విక్రమ్ సేఫ్ ల్యాండర్ తో పాటూ రోవర్ నిర్థేశించిన కక్ష్యలో తిరిగి శాస్త్రవేత్తలు నిర్థేశించిన లక్ష్యాలన్నింటినీ పూర్తి చేసుకుంది. ఇంతగా అలిసిన రోవర్ ను స్లీప్ మూడ్ లోకి పంపించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దమయ్యారు. మళ్ళీ తిరిగి ఆన్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇలా నిద్రాణ స్థితిలోకి ఉంచినందున ఏపీ ఎక్స్ఎల్, లిబ్స్ పరికరాలు పూర్తిగా పనిచేయవు. దీంతో ల్యాండర్ నుంచి ఎలాంటి డేటా ఇస్రోకు లభించే ఆస్కారం ఉండదు.
స్లీప్ మోడ్ ఎందుకంటే..
చంద్రమండలం పై ఒక పగటి పూట అంటే మనకు 14 రోజులు. అందుకే చంద్రుడిపై వెలుగులు వచ్చే సమయంలో చంద్రయాన్ 3 ని నింగిలోకి పంపించి అక్కడి పరిస్థితులను కనుగొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే అక్కడి సూర్యకాంతి సహాయంతోనే ప్రజ్ఞాన్ బ్యాటరీలను ఫుల్ గా ఛార్జ్ చేసుకుంటుంది. తాజాగా చంద్రయాన్ తొలి అడుగు మోపిన చోట చీకట్లు అలుముకుంటున్నాయి. చంద్రుడిపై ఒక రాత్రి కాలం కూడా మనకు 14 రోజులకు సమానం. అంటే మనకు దాదాపు ఒక నెల రోజులు అయితే అక్కడ ఒక్కరోజుగా అర్థం చేసుకోవాలి. రాత్రి పూట వచ్చే మైనస్ 200 డిగ్రీలను ఇందులో పంపించిన రెండు వ్యోమనౌకలు అనగా ల్యాండర్, రోవర్ లు తట్టుకోలేవు. వాటిలోని కొన్ని సున్నితమైన భాగాలు మంచుకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
రోవర్ గురించిన అప్డేట్స్ మరో 14 రోజుల తరువాతే
నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విక్రమ్, ప్రజ్ఞాన్ లు తిరిగి 14రోజుల రాత్రి సమయం అయిపోయాక తిరిగి ఆటోమేటిక్ గా ఆన్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కారణం మళ్ళీ సూర్యకిరణాలు ఈ వ్యోమగాములపై పడి యాక్టివ్ గా పనిచేయవచ్చు. ఈ ప్రక్రియ కచ్చితంగా జరగాలంటే ల్యాండర్, రోవర్ లలో బ్యాటరీ సామర్థ్యం స్విచ్ ఆఫ్ చేసే సమయంలో సంపూర్ణంగా ఉండాలి. అప్పుడు తిరిగి సూర్యోదయం అయినప్పుడు అక్కడి పరిస్థితులను మన అదుపులో ఉంచుకునేందుకు దోహదపడుతుందంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది పనిచేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈనెల 22వ తేదీ వరకు వేచి చూడాలి. ఎందుకంటే చంద్రమండలం పై అప్పుడే తిరిగి స్యూర్యోదయం అవుతుంది కనుక. ప్రస్తుతం ఫుల్ బ్యాటరీతో ఉన్న సమయంలోనే వీటిని స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలిపారు. అలాగే రోవర్ కి సోలార్ శిలా ఫలకాలను కూడా స్యూర్యకాంతి బాగా పడేలా అమర్చినట్లు పేర్కొన్నారు. ఒక వేళ ఏదైనా సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తి తిరిగి యాక్టివ్ గా పనిచేయకపోతే భారతదేశం తరఫున మనం పంపిన రాయబారిగా అలాగే చిరస్థాయిగా మిగిలిపోతుందని తెలిపారు. ఇప్పటి వరకూ 100 మీటర్లకు పైగా ప్రయాణం చేసినట్లు వివరించారు. ఇక మరిన్ని మీటర్లు, కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంకెన్ని అద్భుతాలను అందిస్తుందో తెలియాలంటే మరో పక్షం రోజులు వేచి చూడక తప్పదు.
T.V.SRIKAR