Internships In IT Compenys: ఐటీ రంగంలో సరికొత్త శకం ప్రారంభం.. చదువుకుంటూనే లక్షలు సంపాధించే సువర్ణావకాశం 

ఐటీ అంటేనే ఇన్ కం పెరిగే ఉద్యోగం అని ఒకప్పుడు భావించే వారు. కానీ మన్నటి వరకూ పరిస్థితులు వీటికి భిన్నగా కనిపించాయి. ఐటీ అంటే ఇన్ ఆర్ అవుట్ అనేలా మారిపోయాయి. దీనికి ప్రదాన కారణం అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఎదురైన ఆర్థిక పరిస్థితులు. అయితే తాజాగా కొన్ని ఐటీ కంపెనీలు ఇంటర్న్ షిప్ పేరిట తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చూస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. వీటి గురించి మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 11:33 AMLast Updated on: Sep 26, 2023 | 11:33 AM

It Companies Provide Internship Opportunities To B Tech Students In The Name Of Internship

తాజాగా ఐటీ కంపెనీలు ఇంటర్న్ షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. గతంలో అగ్రరాజ్యమైన అమెరికా, యూరప్ దేశాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా సాఫ్ట్ వేర్ పరిశ్రమ మందకొడిగా సాగింది. కొన్ని పరిశ్రమలైతే మూతపడ్డాయి. మరి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగించేశాయి. తాజాగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఈ రంగం ముందుకు వచ్చింది. అయితే అనుభవం ఉన్న వారికి కాకుండా ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న వారికి పెద్దపీట వేసింది. 2023, 2024 అకాడమిక్ ఇయర్ కి చెందిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చూసుకోవచ్చు.

క్యాంపస్లో ప్లేస్ మెంట్స్ లేక ప్రత్యేక కోర్సులకు పయనం..

గతంలో బీటెక్ చదివే క్రమంలో క్యాంపస్ ఇంటర్వూల ద్వారా కంపెనీలే తమ తమ కళాశాలలకు వచ్చి మంచి ప్రతిభ, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేసుకునేవి. అయితే గత రెండేళ్ల కాలం నుంచి ఇలాంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. దాదాపు మూడేళ్లుగా చదువు ముగించుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల లక్షల్లో ఉన్నారు. వీరందరూ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లి మరిన్ని ప్రత్యేకమైన కోర్సులు చేసేందుకు పయనమయ్యారు. ఇలాంటి పరిస్థితులు రానున్న జనరేషన్ వారికి రాకుండా ఉండేందుకు ఈ సరికొత్త సంప్రాదాయానికి తెరలేపాయి ఐటీ సంస్థలు.

ఎవరు అప్లై చేసుకోవాలి.. జీతం ఎంత..

  • ఈ ఇంటర్న్ షిప్ కి బీటెక్ రెండవ సంవత్సరం నుంచి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ అర్హులే.
  • ఆసక్తి ఉన్న వారు సంబంధిత కంపెనీ అధికారిక సైట్లో వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు.
  • పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారిని ఎంపిక చేసుకుంటారు.
  • ఎంపికైన వారికి బీటెక్ చదువుతుండగానే ఉద్యోగంలో నియమించుకుంటారు.
  • ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ. 40 నుంచి లక్ష రూపాయల వరకూ స్టై ఫండ్ రూపంలో అందజేస్తారు.
  • చదువు ముగించున్న వెంటనే అనుభవంతో పాటూ మంచి ప్రతిభ కనబరిస్తే జీతం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏ ఏ కోర్సుల్లో ప్రావీణ్యం ఉండాలి..

ఇంటర్న్ షిప్ ద్వారా ఉద్యోగాన్ని సంపాధించాలనుకునే వారికి ఆప్టిట్యూడ్, కోడింగ్, డీఎస్, కోడింగ్ విత్ జావా, పైథాన్, సీ, సీ++, డీఎస్ఏ కోడింగ్ వంటి కోర్సులపై  పట్టు ఉండాలి. చదువుతున్న సమయంలోనే ఏడాదికి ఒక కోర్సుపై అవగాహన పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు, మూడు సెమిస్టర్లు పూర్తి చేసుకున్న తరువాత ఉద్యోగానికి అర్హులవుతారు అంటున్నాయి కంపెనీలు. ఇవన్నీ చేయాలంటే బీటెక్ లో చేరిన తరువాత దాదాపు ఏడాదిన్నర కాలంపాటూ వీటిపై అవగాహన పెంచుకొని ఉద్యోగాన్ని పొందవచ్చు. ఎక్కువగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు 70-80 శాతం ఇంటర్న్ షిప్ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఏఏ కంపెనీల్లో ఎలాంటి అవకాశాలు..

అడోబ్, అమెజాన్ వావ్, అట్లాసియస్ అనే కంపెనీలు ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాయి. వీరిని ఎంపిక చేసుకునే ప్రక్రియలో కోడింగ్ కాంపిటీషన్ ప్లస్ హ్యాకథాన్ అనే దానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధమ శ్రేణి సాధించిన వారికి నగదు బహుమతులను కూడా అందజేస్తున్నాయి. మైక్రోసాప్ట్, గోల్డ్ మ్యాన్ శాక్స్, రూబ్రిక్ ఇంక్, జీఈ కంపెనీలు బీటెక్ లో సీఎస్ఈ, ఐటీ గ్రూప్ తీసుకున్న వాళ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ, డైరెక్ట్ ఐ, సేల్స్ ఫోర్స్ తదితర ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఆసక్తికలిగిన వారికి రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించాయి. వీరికి మూడు నుంచి ఆరు నెలల పాటూ ఇంటర్న్ షిప్ అందిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలైతే కేవలం బీటెక్ నాలుగవ ఏడాలిలో మాత్రమే ఆఫర్ ను ప్రకటిస్తున్నాయి.

ప్రోడక్ట్ కంపెనీలు అధిక జీతాలను అందించేందుకు  ముందుకు వస్తున్న తరుణంలో డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ పై మంచి పట్టు ఉన్న వారినే ఎంపిక చేసుకుంటున్నాయి. వెర్బల్, రీజనింగ్, కమ్యూనికేషన్ పై ఇప్పటి వరకూ శ్రద్ద చూపిన కంపెనీలు ఇప్పుడు డీఎస్ఏ పై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఏది ఏమైనా చదువుకుంటూనే ఉద్యోగం సాధించి మంచి ప్రతిభ చూపడం ద్వారా శాశ్వత ఉద్యోగాన్ని మంచి జీతంతో పొందేందుకు ఇది సువర్ణ అవకాశం అని చెప్పాలి.

T.V.SRIKAR