Rajamouli: చివరి సినిమా అదే !
రాజమౌళి చివరి సినిమా మహేశ్ మూవీ తర్వాతే ఉండబోతోందా? నిజంగానే ఈ డౌట్ రావడానికి కోటి కారణాలున్నాయి. అందులో కొన్నింటి మీద ఫోకస్ చేస్తే మహేశ్ బాబు తర్వాత మళ్లీ రాజమౌళి ఎవరితో సినిమా లు తీస్తాడు అంటే, అలాంటి ఊహాగానాలేవి లేవు.

It is claimed that Rajamouli will retire as a film director with the sequels of Mahabharata.
రాజమౌళి చివరి సినిమా మహేశ్ మూవీ తర్వాతే ఉండబోతోందా? నిజంగానే ఈ డౌట్ రావడానికి కోటి కారణాలున్నాయి. అందులో కొన్నింటి మీద ఫోకస్ చేస్తే మహేశ్ బాబు తర్వాత మళ్లీ రాజమౌళి ఎవరితో సినిమా లు తీస్తాడు అంటే, అలాంటి ఊహాగానాలేవి లేవు. కాకపోతే మహాభారతం అనేది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నో సార్లు చెప్పాడు. ఆ డ్రీమే త్వరలో పట్టాలెక్కేలా ఉంది. రాజమౌళి ఎప్పుడూ తను చేసే ప్రాజెక్ట్ మీదే పనిచేస్తూ, మరో కన్ను ఫ్యూచర్ ప్రాజెక్ట్ మీద వేస్తాడు.
ఆ ప్రాసెస్ లోనే ఈమధ్య కొన్ని టెంపుల్స్ ని చుట్టేయటం జరిగింది. ఇది కేవలం కుటుంబ యాత్రలే కాదు, తన పరిశోదనకోసం కూడా చేసిన యాత్రలే అని తెలుస్తోంది. మహేశ్ బాబుతో ప్లాన్ చేసిన మూవీ ఇండియానా జోన్స్ తరహాలో భారీగా తీయబోతున్నాడు. కనీసం రెండు ఏళ్లైనా ఈ ప్రాజెక్ట్ తో బిజీ అవుతాడు. మరో ఏడాది రిలాక్స్ అవుతాడు.. అదే జరిగితే 2026 లో రాజమౌళి ఫ్రీ అయ్యాక తన వయసు, 53 లో పడుతుంది. కాబట్టి మహాభారతం తీయటానికి అదే సరైన సమయం. కారణం మహాభారతం తీస్తే కనీసం 5 నుంచి పది భాగాలైనా తీయాలనేది జక్కన్న ఆలోచన
అలాచూస్తే హాలీవుడ్ లో అవతార్ సీక్వెల్స్ తో కెరీర్ కి గుడ్ బై చెప్పాలనుకున్న జేమ్స్ కామెరున్ లానే, ఇక్కడ మహాభారతం సీక్వెల్స్ తో జక్కన్న రిటైర్ అవుతాడనే వాదనుంది. ఈ వాదన ఇప్పుడు బలపడటానికి కొందరుస్టార్లను కలిసినప్పుడు రాజమౌళి మీకు మహాభారతంలో ఇష్టమైన పాత్ర ఏది అని అడిగాడట. మహేశ్, సూర్య, ప్రభాస్ ఈ ముగ్గురిని అలాంటి ప్రశ్నలు వేశాడని, కాబట్టి మహేశ్ మూవీ ప్లాన్ చేస్తూనే మరో వైపు మహాభారతం తాలూకు ప్లానింగ్స్ కూడా మొదలుపెట్టాడనే ప్రచారం ఊపందుకుంది.