Jagan Assembly 2207 : ఈసారికి అసెంబ్లీ గండం గట్టెక్కింది.. జగన్ ప్లాన్ ఇదే కదా !
ఒన్ షాట్... టూ బర్డ్స్... ఇది వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వ్యూహం. వై నాట్ 175 అంటే... ఏపీ జనమేమో... మరీ 11 సీట్లే ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే ముఖం చెల్లట్లేదు.
ఒన్ షాట్… టూ బర్డ్స్… ఇది వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వ్యూహం. వై నాట్ 175 అంటే… ఏపీ జనమేమో… మరీ 11 సీట్లే ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే ముఖం చెల్లట్లేదు. పైగా ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు… స్పీకర్ చైర్ లో తనకు ఇష్టంలేని అయ్యన్నపాత్రుడు ఉన్నారు… ఇలా రక రకాల ప్రస్టేషన్లతో ఉన్న జగన్… మంచి ప్లానేశారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయన్న సాకుతో ఢిల్లీలో ధర్నాకు పోతున్నారు. అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఇదంతా అని అందరికీ తెలుసు.
ఏపీ అసెంబ్లీలో ముఖం చాటేయ్యడానికి మాజీ సీఎం జగన్ పిల్లి మొగ్గలు వేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతోంది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా… వాటిని పట్టించుకోకుండా ఢిల్లీలో ధర్నా పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇదే కామెంట్ చేశారు. నిన్ను ఎన్నుకున్నది జనం… పార్టీ నేతలు కాదు… అలాంటి జనం వరదల్లో అల్లాడుతున్నారు. ప్రతిపక్ష నేతగా వాళ్ళని పరామర్శించాల్సింది పోయి. నీ పార్టీ కార్యకర్తల కోసం ఢిల్లీకెళ్ళి ధర్నా చేస్తావా… ఇది అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ప్లాన్ కదా అని షర్మిల ప్రశ్నించారు.
ఈ అసెంబ్లీ సమావేశాలు ఏపీకి చాలా కీలకమైనవి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు… ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు లాంటి కీలక బిల్లులు ఉన్నాయి. ఇవి కాకుండా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మూడు శ్వేతపత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇలాంటి కీలక సమయాల్లో తనపై వచ్చే విమర్శలకు అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చుకోవాల్సిన జగన్… ఢిల్లీకి పారిపోవడంపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అంతేకాకుండా… ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, కాలువలు ఉప్పొంగడంతో వేల ఎకరాల్లో పంట నష్టంతో… జనం రోడ్డున పడ్డారు. అలాంటి వారి కోసం ఓదార్పు యాత్ర నిర్వహించి… జనంలో సానుభూతి కోసం ట్రై చేయాల్సిన జగన్… ఢిల్లీకి వెళ్ళడం… అక్కడే నాలుగైదు రోజులు మకాం వేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్ మాత్రం… ఎవరేమనుకున్నా… ఈసారికి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే బాధ తప్పిందని సంతోషపడుతున్నారు.