Boyapati Srinu: ఆల్ మోస్ట్ గెంటేశారు..?
బోయపాటి శీను కి అటు అల్లు అర్జున్, ఇటు కోలీవుడ్ హీరో సూర్య ఇద్దరి దగ్గర ఘోర అవమానమంటూ గుసుగుసలు పెరిగాయి.

It is known that Allu Arjun and Suriya are not giving opportunities to Tollywood film director Boyapati Srinu
బోయపాటి శీను కి అటు అల్లు అర్జున్, ఇటు కోలీవుడ్ హీరో సూర్య ఇద్దరి దగ్గర ఘోర అవమానమంటూ గుసుగుసలు పెరిగాయి. రీజన్ స్కంద ప్లాప్ తర్వాత తన చేతిలో అఖండ సీక్వెల్ కాకుండానే రెండు సినిమాలున్నాయన్న బోయపాటి, బన్నీకి స్కెచ్చేస్తే సీన్ రివర్స్ అయ్యిందట.
గతంలో సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడని, బోయపాటి మీద బన్నీకి గౌరవం ఉండొచ్చు. కాని పుష్ప తో నేషనల్ హీరో అయిన తను, మళ్లీ బోయపాటి సినిమాలు చేసి వచ్చిన క్రేజ్ ని ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకునే అవకాశం లేదు. బాలయ్యకి తప్ప బోయపాటి సినిమా ఎవరికీ కలిసిరాదనేలా వరుసగా తనకి ఫ్లాపులు పడుతున్నాయి.
అంతేకాదు పుష్ప 2 పూర్తవ్వాల్లి, త్రివిక్రమ్, ఆట్లీ సినిమాలు చేయాలి.. ఆతర్వాత కథా బన్నీ ఫ్రీ అయ్యేది.. సో అప్పటి వరకు బోయపాటి వేయిట్ చేస్తాడా? చేసినా అల్లు అర్జున్ తనకి ఆఫర్ ఇస్తాడా అంటే కనీసం కాల్ కూడా ఎత్తలేదని తెలుస్తోంది. ఇంతకంటే ఘోరం అల్లు అరవింద్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ సపోర్ట్ తో తమిళ హీరో సూర్యకి కథ చెప్పడానికి పోతే, అక్కడ డోర్ క్లోజ్ అయ్యిందట.
టాలీవు్డ టాప్ ప్రొడ్యూసర్ అనే గౌరవంతో, అల్లు అరవింద్ రికమెండ్ చేస్తే బోయపాటి కథ వినేందుకు సూర్య ముందు ఓకే చేశాడట. తర్వాత అపాంట్ మెంట్ రోజు మాత్రం బోయపాటి వస్తే, సూర్య షూటింగ్ ఉందని వెళ్లాడని తెలుస్తోంది. ఇలా తను బోయపాటికి హ్యండ్ ఇవ్వటం రెండోసారి. ఆఖరికి మీడియం రేంజ్ హీరో సాయితేజ్ కూడా బోయపాటి పిలుపుకి పలకలేదని తెలుస్తోంది. ఏదేమైనా బోయపాటి మూవీలో ఫైట్లు తప్ప కంటెండ్ ఉండకపోవటంతో హీరోలు దూరం పెడుతున్నారంటున్నారు. మళ్లీ బాలయ్య కరుణిస్తే అఖండ 2 పట్టాలెక్కితేనే బోయపాటి మెగా ఫోన్ పట్టేఛాన్స్ ఉందంటున్నారు.