Jio Smart Phone: జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్స్.. మార్కెట్లో అందుబాటులోకి ఎప్పుడంటే..?
జియో తన వ్యాపార సామ్రాజ్యాన్ని రోజు రోజుకూ విస్తరించుకుంటుంది. దీనికి సాంకేతికతనే పెట్టుబడిగా పెడుతోంది. మన్నటి వరకూ ప్రతి ఒక్క సామాన్యుని చేతిలో జియో లాప్ టాప్ ఉండేలా ప్రణాళికలు రచించి అతి తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ వార్త ఇంకా మరిచిపోక ముందే ఈనెల 28న 5జీ టెక్నాలజీతో నడిచే రెండు ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

It is known that amazing smartphones from Jio will be launched at the end of August
జియో ప్రత్యేక స్పెసిఫికేషన్లతో, అద్భుతమైన ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్లను ఈనెలలో ప్రతి ఒక్కరికీ చేరువచేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా వీటికి సంబంధించిన వివరాలను ముకుల్ శర్మ అనే టిప్ స్టర్ కొన్ని ప్రత్యేకమైన వివరాలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. జియో కంపెనీకి చెందిన రెండు స్మార్ట్ ఫోన్లు JBV161W1, JBV162W1 పేర్లతో రిజిస్టర్ అయినట్లు తెలిపారు. అలాగే ఆగస్ట్ 11న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి సర్టిఫికేషన్ పొందినట్లు వివరించారు. ఇందులోని ఫీచర్లు ఇలా ఉంటాయని అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ కొందరు సోషల్ మీడియా వేదకగా తెగ వైరల్ చేస్తున్నారు. వీటి డమ్మీ మోడల్, ధరను వెల్లడించలేదు. ఈనెల 28 న జరిగే రిలయన్స్ ఏజీఎంలో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలిస్తుంది.
వైరల్ అవుతున్న ఫీచర్స్ ఇవే..
- స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్.
- 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.
- 13 మెగా పిక్సల్ కెమెరా.
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
T.V.SRIKAR