Gummadi అసెంబ్లీ బరిలో గుమ్మడి నర్సయ్య కూతురు.. ఖమ్మంలో బీఆర్ఎస్ అదిరిపోయే ప్లాన్..
రాజకీయాలను చాలామంది నడిపిస్తారు.. జనాన్ని నడిపించేవాడే, జనాల కోసం నడిచేవాడే నిజమైన నాయకుడు. రాజకీయ నాయకులు చాలామంది ఉండొచ్చు.. నాయకులు మాత్రం కొంతమందే ఉంటారు. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు అలాంటి వాళ్లని! అలాంటి నాయకుల లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు గుమ్మడి నర్సయ్య.
రాజకీయాలను చాలామంది నడిపిస్తారు.. జనాన్ని నడిపించేవాడే, జనాల కోసం నడిచేవాడే నిజమైన నాయకుడు. రాజకీయ నాయకులు చాలామంది ఉండొచ్చు.. నాయకులు మాత్రం కొంతమందే ఉంటారు. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు అలాంటి వాళ్లని! అలాంటి నాయకుల లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు గుమ్మడి నర్సయ్య. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు.. మనవళ్ల మనవళ్ల వరకు తరతరాలు కూర్చొని తినేంత డబ్బులు పోగేసుకుంటున్న ఎమ్మెల్యేలు ఉన్న ఈ కాలంలో.. ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా.. కనీసం సొంత ఇళ్లు కూడా సంపాదించకపోగా.. అప్పుల పాలయ్యారు గుమ్మడి నర్సయ్య. ఇల్లందు నుంచి గుమ్మడి నర్సయ్య.. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికి అయన పేరు మీదా ఓ పొలం తప్ప మరేమీ లేదు.
నియోజకవర్గాల పునర్విభజనతో రెండుసార్లు ఓడిపోయారు. అయినా కూడా జనం మధ్యలోనే ఉన్నారు. ఓడిపోతే కొందరు పార్టీలు మారుతుంటారు. కానీ గుమ్మడి నర్సయ్య ఎప్పుడూ అలా చేయలేదు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయ్. దీంతో గుమ్మడి నర్సయ్యలాంటి గొప్ప నాయకుల గొప్పదనం గుర్తించలేక గుడ్డిగా బతికేస్తున్నారు జనాలు. ఐతే ఇప్పుడు గుమ్మడి నర్సయ్య కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్.. ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తోంది. ఇల్లందు నుంచి గుమ్మడి నర్సయ్య కూతురు.. గుమ్మడి అనురాధకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
అనురాధ ప్రస్తుతం ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇల్లందు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన హరిప్రియ.. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఐతే ఈసారి ఇల్లందు అభ్యర్థిని మార్చాలని బీఆర్ఎస్ నాయకత్వం ఎప్పుడో నిర్ణయానికి వచ్చింది. హరిప్రియ స్థానంలో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందని అనుకుంటున్న సమయంలో.. జిల్లా నాయకులు అనూరాధ పేరు సూచించారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వీక్. వలస వచ్చిన నేతలే తప్ప.. పార్టీ పేరుతో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా తక్కువ. పైగా పొంగులేటిలాంటి నాయకులు.. బీఆర్ఎస్ మీద ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాగా వేయాలని గులాబీ పార్టీ పావులు కదుపుతోంది.
ఇప్పటికీ జనాల్లోనే ఉన్న.. జనం బలం ఉన్న గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధను పార్టీ తరఫున బరిలోకి దించితే.. బాగుంటుందని భావిస్తోంది. గుమ్మడి ఫ్యామిలీ ఇమేజ్ వాడుకోవాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అనురాధ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతుండగానే.. బయ్యారం, ఇల్లందు మండలంలో ఆమె ఫ్లెక్సీలు వెలిశాయ్. ఇల్లందు నియోజకవర్గ జనాలు కోరుకునేది మిమ్మల్నే అక్క అంటూ.. ఆ ఫ్లెక్సీల్లో రాసుకొచ్చారు. మరి అనురాధ పోటీ చేస్తారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.