Pawan Kalyan : పవన్ కళ్యాణ్ vs అల్లు అర్జున్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన పవన్..

It is known that Power Star Pawan Kalyan contested as MLA from Pithapuram as a Jana Sena candidate and won.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన పవన్.. ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నారు. అయితే.. సినిమాల పరంగా చూసుకుంటే, త్వరలోనే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. పవన్ వర్సెస్ అల్లు అర్జున్ అనే టాక్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి.. ఏపి 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మెగా ఫ్యామిలీ మొత్తంగా పవన్‌కు మద్దతుగా నిలిచింది.
మెగా హీరోలంతా పవన్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. ప్రచారం చివరి రోజున రామ్ చరణ్, అల్లు అరవింద్ కూడా వెళ్లారు. కానీ అదే రోజు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లాడు. అక్కడి నుంచి మెగా వర్సెస్ అల్లు వార్ మరింత ముదిరింది. ఈ అంశం మీద నాగబాబు చేసిన ట్వీట్ దుమారం లేపింది. మావాడైనా పరాయి వాడే అంటూ చేసిన ట్వీట్‌ను ఆ తర్వాత డిలీట్ చేశాడు. కానీ మెగా అభిమానులు బన్నీ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
అల్లు ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ పై కౌంటర్ ఎటాక్ చేశారు. ఫైనల్‌గా జనసేన, బిజెపి, తెలుగుదేశం కూటమీ భారీ మెజారిటీతో గెలుపొందింది. బన్నీ సపోర్ట్ చేసిన నంద్యాల అభ్యర్థి కూడా ఓడిపోయాడు. అయినా కూడా బన్నీకి భారీ డ్యామెజ్ జరిగింది. ఏకంగా పుష్ప2 సినిమాను డిసెంబర్ 6కి వాయిదా వేసుకున్నాడు. అయితే.. ఇప్పుడు పుష్ప2కి పోటీగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట‌్టుగా తెలుస్తోంది. లేటెస్ట్‌గా.. ఈ సినిమా నిర్మాత ఎం.రత్నం మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ రెండు, మూడు వారాలు డేట్లు చాలు.. సినిమాను డిసెంబరులో విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకవేళ పవన్ డేట్స్ ఇస్తే.. డిసెంబరులో వారం గ్యాప్‌లో వచ్చిన సరే హరిహర వీరమల్లు వర్సెస్ పుష్ప2 వార్ మామూలుగా ఉండదనే చెప్పాలి. మరి.. మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.