Congress Party: కాంగ్రెస్‌లో వీళ్లకు టికెట్ ఫైనల్ అయినట్లే !
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముందుగా ఎంపికైన వాళ్లు వీరే.
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా.. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించింది. వీటిని స్క్రీనింగ్ చేసి.. ఓ లిస్ట్ రెడీ చేసి.. అధిష్టానానికి పంపిస్తే.. ఫైనల్ లిస్ట్ బయటకు వస్తుంది. 119 నియోజకవర్గాలకు దాదాపు వెయ్యి మందికి పైగా అప్లికేషన్స్ పెట్టుకోగా.. కాంగ్రెస్ తొలి జాబితా ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. మొత్తం 119నియోజకవర్గాలకు 12వందల 20 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్స్‌ను వడబోసి నియోజకవర్గానికి ముగ్గురు బలమైన నేతలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని.. పీసీసీ కమిటీ రెడీ చేసింది.
వివిధ కోణాల్లో దరఖాస్తులను పరిశీలించి.. షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత ముగ్గురి పేర్లను ఫైనల్ చేసింది. ఈ పేర్లలో కూడా ప్రయారిటి బేసిస్‌లో.. 1,2,3 అంటు టిక్కులు పెట్టి జాబితాను రెడీ చేసి కవర్‌లో పెట్టి సీల్ చేసింది. అలాగే పోటీకి ఒక్క పేరు మాత్రమే వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించింది. నియోజకర్గంలో పోటీకి ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చిందంటే.. వాళ్లకి టికెట్ ఫైనల్ అయినట్లే ! ఇలాంటి నియోజకవర్గాలు 24 ఉన్నాయ్.
- కొడంగల్‌లో రేవంత్ రెడ్డి,
- సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి,
- కామారెడ్డిలో షబ్బీర్ ఆలీ, భద్రాచలంలో పొడెం వీరయ్య,
- నాగార్జునసాగర్‌లో కుందూరు జయవీర్ రెడ్డి,
- నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
- ఆలంపూర్‌లో సంపత్ కుమార్,
- మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్ రావు,
- ఆందోల్‌లో దామోదర రాజనర్సింహా,
- పరిగిలో రామ్మోహన్ రెడ్డి,
- వికారాబాద్‌లో గడ్డం ప్రసాద్,
- ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి,
- ఆలేరులో వీర్ల ఐలయ్య,
- దేవరకొండలో వద్య రమేష్ నాయక్,
- వేములవాడలో ఆది శ్రీనివాస్,
- ధర్మపురిలో లక్ష్మణ్,
- పరకాలలో వెంకట్రామరెడ్డి,
- హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి,
- కోదాడలో పద్మావతి,
- మధిర నుంచి బట్టి విక్రమార్క,
- మంథని నుంచి శ్రీధర్ బాబు,
- జగిత్యాలలో జీవన్ రెడ్డి,
- ములుగులో సీతక్క,
- హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్
వీరికి టికెట్ ఖాయం అయినట్లే. పీసీసీ ఇచ్చిన సీల్డ్ కవర్‌ను స్క్రీనింగ్ కమిటి సభ్యులు.. జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులతో చర్చించారు. ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటి తన అభిప్రాయాలతో నివేదిక రెడీచేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. అక్కడ మళ్లీ సమావేశమై అభ్యర్ధుల ఎంపిక జరుగుకతుంది. ఢిల్లీలోనే అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకే పెద్ద పోటీ వేయబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. మరి ఆచరణలో ఎంతవరకు జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.