Bharateeyudu 2 : ఈసారి సేనాపతి ఏం చేస్తాడో
శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు.
శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా సేనాపతి క్యారెక్టర్ లంచగొండుల గుండెల్లో దడ పుట్టించింది. కొడుకును సైతం క్షమించని సేనాపతి.. ఇప్పుడు మళ్లీ థియేటర్లోకి వస్తున్నాడు. భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 రిలీజ్‌కు రెడీ అయిపోయింది.
చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొని.. ఫైనల్‌గా జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో.. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే తమిళ వర్షన్ సెన్సార్ పూర్తికాగా.. ఇప్పుడు తెలుగు వర్షన్ సెన్సార్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. అయితే.. తమిళ, తెలుగు వెర్షన్ నిడివి విషయంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. మొత్తం 180 నిమిషాల 4 సెకండ్ల నిడివితో భారతీయుడు రాబోతోంది.
అంటే.. మూడు గంటల రన్‌టైం లాక్ చేసుకుంది. అయితే.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని ఒకే భాగంగా రిలీజ్ చేయాలనుకున్నాడు శంకర్. కానీ నిడివి బాగా పెరిగిపోయిన నేపథ్యంలో భారతీయుడు 3 కూడా రెడీ చేస్తున్నాడు. అయినా కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్ మూడు గంటల రన్ టైంతో రానుండడం విశేషం. ఇక భారతీయుడు 3 సినిమాని మరో ఆరు నెలల తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే.. ఇండియన్ 2 ఎండింగ్‌లో ఇండియన్ 3 ట్రైలర్ చూపించనున్నారు. మరి ఈసారి సేనాపతి ఏం చేస్తాడో చూడాలి.