World Cup, Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ తో అంత ఈజీ కాదు.. సఫారీలు సెమీస్ గండం దాటుతారా ?

టీ ట్వంటీ వరల్డ్ కప్ చివరి స్టేజ్ కు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. వరుస విజయాలతో సెమీస్ లో అడుగుపెట్టి సఫారీలనే ఫేవరెట్ గా చెబుతున్నా ఆఫ్ఘనిస్తాన్ ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2024 | 01:06 PMLast Updated on: Jun 27, 2024 | 1:06 PM

It Is Not So Easy With Afghanistan Will The Safaris Cross The Semis

 

 

టీ ట్వంటీ వరల్డ్ కప్ చివరి స్టేజ్ కు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. వరుస విజయాలతో సెమీస్ లో అడుగుపెట్టి సఫారీలనే ఫేవరెట్ గా చెబుతున్నా ఆఫ్ఘనిస్తాన్ ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. అన్నింటికీ మించి సౌతాఫ్రికాకు నాకౌట్ గండం పొంచి ఉంది. చాలా సందర్భాల్లో సఫారీలు సెమీస్ ను దాటలేకపోయారు. అందుకే వారిపై చోకర్స్ గా ముద్ర పడిపోయింది. వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్‌లోనూ, ఇటు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ క‌నీసం ఒక్క‌సారి కూడా ఫైన‌ల్లో అడుగుపెట్టలేకపోయింది. ప్రస్తుత మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో క్వింటన్‌ డికాక్‌, స్టబ్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌ వంటి ఆటగాళ్లు మంచి ఫాంలో ఉన్నారు. అయితే స్పిన్ ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడడం సఫారీ బ్యాటర్లకు మైనస్ పాయింట్. ఆఫ్గాన్‌ ప్రధాన బలం స్పిన్నర్లే. మరి అఫ్గాన్‌ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోర్జే, రబాడ, జానెసన్‌ వంటి పేసర్లు ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్న అఫ్గానిస్తాన్‌ను ఓడించ‌డం ద‌క్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు వంటి ప‌టిష్ట‌మైన జ‌ట్ల‌ను ఓడించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్‌.. రెట్టింపు ఆత్మ‌విశ్వాసంతో స‌ఫారీల‌ను ఢీ కొట్ట‌నుంది. పెద్ద జట్టును వ్యూహాత్మకంగా దెబ్బకొట్టొచ్చు కానీ అంచనాలకు మించి రాణిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్ తో జాగ్రత్తగా ఆడాల్సిందే