Big Boss: ముగ్గురిలో ఇద్దరు ఔట్
బిగ్ బాస్ సీజన్ 7 అన్నీ ఉల్టా.. పల్టా అంటూ నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే తాజాగా ఈ వారంలో ఇద్దరు ఒకే సారి ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తోంది.

It is reported that Shakila and Shobha Shetty will be eliminated this week in Bigg Boss season 7 show
తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న ప్రోగ్రామ్ బిగ్ బాస్ షో. సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు..ఆసక్తికరంగా ఉండటంతో బిగ్ బాస్ సీజన్ 7 సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది.అయితే ప్రజెంట్ జరుగుతున్న షో లో రెండో వారంలోనే డబుల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.
ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో కిరణ్ రాథోడ్ బయటకు వెళ్లిపోయింది. తాజా సీజన్‌లోని రెండో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో గతంలో కంటే భిన్నంగా కొన్ని గొడవలతో సాగింది. చివరికి ఇందులో 9 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజి, అమర్‌దీప్‌లు నామినేట్ అయ్యారు. అయితే, ప్రిన్స్ యావర్‌ను మాత్రం సందీప్ నేరుగా నామినేట్ చేసేశాడు.
బిగ్ బాస్ ఏడో సీజన్ రెండో వారంలో జరిగిన ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ తర్వాత శివాజి రెండో స్థానంలో ఉన్నాడని తెలిసింది. అయితే, ఆ తర్వాత స్థానాల్లో మాత్రం మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. అమర్ మూడో స్థానంలో, రతిక నాలుగో స్థానంలో ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన అవమానంతో ప్రిన్స్ యావర్ ఓటింగ్ పెరిగి ఐదుకు చేరుకున్నాడు. టేస్టీ తేజ ఆరో స్థానంలో, గౌతమ్ కృష్ణ ఏడో స్థానంలో నిలిచారు. ఇక, ఈ సీజన్‌లో టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్న శోభా శెట్టి మాత్రం ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఫలితంగా షకీలా అందరి కంటే చివర్లో 9వ స్థానంలో ఉంది. వీరిలో చివర్లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు.
బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందట. అదే జరిగితే చివరి రెండు స్థానాల్లో ఉన్న షకీలా, శోభా శెట్టి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. లేదంటే శోభాను ఆపి గౌతమ్‌ను పంపే చాన్స్ కూడా ఉంది. మరోవైపు, ఒకరిని ఎలిమినేట్ చేసి మరొకరిని సీక్రెట్ రూమ్‌లోకి పంపే ట్విస్టును కూడా రెడీ చేస్తున్నారని సమాచారం.