Sree Leela: రౌడీకి భయపడ్డ శ్రీలీల
విజయ్ దేవరకొండతో జోడీకట్టాలనేది యంగ్ హీరోయిన్ల డ్రీమ్. ఆవిషయంలో జాన్వీ కపూర్ నుంచి సారా ఆలిఖాన్ వరకు నార్త్ హీరోయిన్లే కాదు,సౌత్ ముద్దుగుమ్మలు కూడా రౌడీ స్టార్ సరసన మెరవాలనుకుంటారు. కాని శ్రీలీల మాత్రం మెరవాలనుకోవట్లేదు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో రౌడీ స్టార్ చేయబోయే సినిమా నుంచి శ్రీలీలా బయటికొచ్చింది.

It is reported that Srileela said no to act in Rowdy opposite Vijay
విజయ్ దేవరకొండతో జోడీకట్టాలనేది యంగ్ హీరోయిన్ల డ్రీమ్. ఆవిషయంలో జాన్వీ కపూర్ నుంచి సారా ఆలిఖాన్ వరకు నార్త్ హీరోయిన్లే కాదు,సౌత్ ముద్దుగుమ్మలు కూడా రౌడీ స్టార్ సరసన మెరవాలనుకుంటారు. కాని శ్రీలీల మాత్రం మెరవాలనుకోవట్లేదు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో రౌడీ స్టార్ చేయబోయే సినిమా నుంచి శ్రీలీలా బయటికొచ్చింది.
ధమాకా, భగవంత్ కేసరి హిట్ల తర్వాత శ్రీలీలా కళ్లునెత్తికెక్కాయా? అందుకే రౌడీకి నో చెబుతోందా అంటూ కామెంట్ల లాంటి డౌట్లు పెరిగాయి. ఐతే శ్రీలీలా మాత్రం ఈ సినిమానుంచి బయటకి రావటానికి వేరే కారణం ఉంది. అసలు శ్రీలీల బదులు రష్మిక రాబోతోందని ఆమధ్య రూమర్స్ రావటం, వాటిని నిర్మాతలు కండించటంతో, శ్రీలీల మీద మళ్లీ వస్తున్న గుసగుసలు నిజం కావేమో అనుకున్నారు. కాని శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం కన్ఫామ్ అయ్యింది.
గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో ఎప్పుడో పట్టాలెక్కాల్సిన విజయ్ మూవీ, ఫ్యామిలీస్టార్ సినిమా వల్లే డిలే అయ్యింది. సరే ఇప్పుడు పట్టాలెక్కిస్తారు కదా అనుకుంటే, ఈ సినిమా ప్లాన్ చేసిన టైంలో శ్రీలీలకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సో అటు పరీక్షలు, ఇటు సినిమా అంటే కుదరని పనిలా మారింది.
సరే పరీక్షల తర్వాత నటించొచ్చు గా అంటే, పవన్ సినిమా కు ఆల్రెడీ డేట్లిచ్చింది. ఇంకా 4 సినిమాలకు ఎప్పుుడో కమిటైంది. కాబట్టే రౌడీతో జోడీకట్టాలనున్నా, ఇలా అయ్యిందని తెలుస్తోంది. తను తప్పుకోవటంతో తన స్థానంలో అఖిల్ మూవీ ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైధ్య కన్పామ్ అయ్యింది.