CM kcr: చంద్రబాబు అరెస్ట్‌పై ఆరా తీసిన కేసీఆర్‌.. ఎవరికి ఫోన్ చేశారో తెలిస్తే షాక్‌..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి అడిగి తెలుసుకున్న కేసీఆర్..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2023 | 02:55 PMLast Updated on: Sep 12, 2023 | 2:55 PM

It Is Reported That Telangana Cm Kcr Inquired About Ap Opposition Leader Chandrababu Naidus Arrest

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కక్షసాధింపు ధోరణితోనే జగన్‌.. చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఫైర్ అవుతున్నారు. ఐతే చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు.. 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక మాజీ సీఎం అరెస్టు కావటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. చంద్రబాబు అరెస్టుతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. చంద్రబాబు అరెస్టు కావటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్‌ ప్రకంపనలు రేపుతోంది. చంద్రబాబు అరెస్టు విషయంలో.. తెలంగాణలోని వివిధ పొలిటికల్ పార్టీలకు చెందిన నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నోరు మెదపటం లేదు. ఒక్క తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే చంద్రబాబు అరెస్టును ఖండించారు. బాబు అరెస్టుపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

గత నాలుగు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై.. మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఏపీలోని పలువురికి ఫోన్లు చేయించి అక్కడి పరిస్థితిలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు టాక్. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై కేసీఆర్‌కు ఇంత ఆసక్తి ఎందుకు అంటే.. దానికి కారణాలు వినిపిస్తున్నాయ్. ఆరా తీయటానికి కారణం లేకపోలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. చంద్రబాబు, ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్నా.. రాజకీయ కారణాల కారణంగా చాలామంది గులాబీ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్‌ను ఓడించేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం.. బీఆర్‌ఎస్‌ అన్ని విధాలా సహకరించిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కక్షతోనే చంద్రబాబును జగన్‌ అరెస్టు చేయించారనే వాదన ఏపీ నేతల్లో ఉంది.

తెలంగాణలోని మెజార్టీ పాత తెలుగుదేశం కేడర్‌లోనూ అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కార్యకర్తలు, నేతలు రానున్న ఎన్నికల్లో పార్టీపై ఎటువంటి ప్రభావం చూపుతారోనన్న ఆందోళన బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు అరెస్ట్‌, ఆ తర్వాత పరిస్థితులను కేసీఆర్ గమనిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో చంద్రబాబు అరెస్టుపై నెటిజెన్స్‌ పెట్టిన కామెంట్స్‌ను కూడా కేసీఆర్‌ చదువుతున్నారని సమాచారం. బాబు అరెస్ట్‌పై జనాల స్పందన ఎలా ఉంది. తెలంగాణ జనాలు ఏమనుకుంటున్నారు. రాజకీయంగా ఎలాంటి టర్న్ తీసుకుంటుంది. ఇలాంటి విషయాలపై ఆయన ఆరా తీసినట్లు తెలిసింది.