Balagam: గ్రూప్-4 ఎగ్జామ్‌లో బలగం సినిమాపై ప్రశ్న
చిన్న సినిమాగా రిలీజై భారీ విజయాన్ని అందుకుంది బలగం సినిమా. రెండు అతర్జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. పిట్ట ముట్టడం అనే సాంప్రదాయం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు క్యూ కట్టేలా చేసింది.

It is very interesting to see a question about Balagam movie in Telangana group 4 question paper
ప్రజల్లో ఈ సినిమా ఎంత ఆదరణ సంపాదించుకుంది అంటే ఏకంగా గ్రూప్-4 ఎగ్జామ్‌లో బలగం సినిమా గురించి ఓ ప్రశ్న ఇచ్చారు. బలగం సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొమురయ్య పాత్రలో నటించిన వ్యక్తి పేర్లను సరైన కాంబినేషన్‌లో ఎంచుకోండి అంటూ గ్రూప్-4 పేపర్‌లో క్వశ్చన్ వచ్చింది. గ్రూప్-4కు ప్రిపేర్ అయినవాళ్లే కాదు. ఈ ప్రశ్నకు ప్రతీ ఒక్కరూ ఈజీగా సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే బలగం సినిమా ప్రజల్లో సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరు థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు.
చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సినిమానే ప్రేక్షకుల దగ్గరికి వెళ్లింది. చాలా గ్రామాల్లో బలగం సినిమా స్పెషల్ షోలు వేశారు. ప్రొజెక్టర్స్‌తో సినిమా ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోలకు కూడా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూస్తూ ఎమోషనల్ అయినవాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోటీ పరీక్షల్లో కూడా ప్రశ్నలు వచ్చేంత ఆదరణ బలగం సినిమాకు దక్కడంపై మూవీ యూనిట్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.