Adipurush: ఆదిపురుష్ కాదు..సోదిపురుష్.. రావణుడికి గడ్డం..వీడియో గేమ్ గ్రాఫిక్స్.. మొత్తం గబ్బు లేపారు!
భారీ అంచనాల మధ్య రిలీజైన ప్రభాస్ మూవీ 'ఆదిపురుష్'పై సోషల్‌మీడియాలో ఎందుకు విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి..? అసలు సినిమాలో జరిగిన పొరపాటులేంటి..?
రామాయణం, మహా భరతం కథల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మహా గ్రంథాలల్లోని కథలను బెస్ చేసుకోని వచ్చిన సినిమాలు కొన్ని అయితే.. ఈ కథలను స్ఫూర్తిగా తీసుకోని వచ్చిన సినిమాలు మరికొన్ని..! చాలామంది దర్శకులకు, సినీ రచయితలకు ఈ రెండు గ్రంథాలే లైబ్రరీ. ఒక్కొ పాత్ర ఒక్కొ అద్భుతం. అలాంటి కథలను కూడా గబ్బు చేసిన ఘనత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ది. సినిమా రిలీజ్‌కి ముందునుంచే ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఈ చిత్రం రిలీజైన తర్వాత మరింత రచ్చకు దారి తీసింది. రామాయణంలోని క్యారెక్టర్లను వక్రీకరించి తీశారని.. హిందూవుల మనోభావలు దెబ్బతీశారని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.! ఈ సినిమాపై ఎందుకు ఇన్నీ వివాదాలకు కారణమైంది..సోషల్ మీడియాలో ఎందుకు అంతలా ట్రోల్ అవుతుంది..?
రావణుడు చుట్టూ వివాదం:
రావణుడు పెద్ద నీచుడు అని రామాయణంలో ఎక్కడా లేదు. పరస్త్రీపై వ్యామోహం ఉంటే ఎంతటివారికైనా రావణుడికి పట్టిన గతే పడుతుందన్నది ఆ మహాకావ్యం చెబుతున్న గొప్ప సందేశం. ఈ సినిమాలో మాత్రం రావణుడి పాత్రను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. సరే సినిమాటిక్ లిబర్టి అనుకుందామనుకున్నా..కనీసం గెటప్ విషయంలోనూ ఓవర్ చేశారు. రావణుడు జన్మతః బ్రాహ్మణుడు, వేదాలను అభ్యసించాడు, శాస్త్రాలను ఔపోసానపట్టాడు. బ్రాహ్మణులు నిజానికి గెడ్డం లాంటివి పెంచుకోరు.. కానీ సినిమాలో రావణుడికి ఓ గెడ్డం తగిలించారు.. శ్రీలంకలో షేవింగ్ షాపులు లేవా అని ప్రజలు అనుకునేలా ఆ గెడ్డం కనిపించింది. అటు రావణుడుకి తలకు అడ్డంగా, నిలువుగా మిగిలిన తలలు కనిపించడం మరో విడ్డూరం. వాల్మికి రాసిన రామాయణాన్నే అసలైన రాముడి చరిత్రగా ప్రజలు నమ్ముతారు. ఈ చిత్రంలో మాత్రం రావణుడు నుంచి రాముడి పాత్ర వరకు అంతా కల్పితమే.. ఆఖరికీ గెటప్‌లు కూడా వెగుటు పుట్టించాయని సాక్ష్యాత్తు రామ భక్తులే విమర్శలు గుప్పిస్తున్న దుస్థితి..
మరోవైపు రామాయణం ప్రకారం లంకకు రాజు రావణుడు..అందుకే ఆయన్ను లంకేశుడి అంటారు. శ్రీలంక అంటే మన దేశం కిందనే..ఇండియన్ ఓషన్ తీర ప్రాంతం. ఆదిపురుష్ సినిమాలో మాత్రం శ్రీలంకను ఏదో వేరే గ్రహంలో ఉన్నట్టు చిత్రీకరించారు. అదో మాయలోకంలా చూపించారు. అది సరిపోదన్నట్టు రావణ సైన్యాన్ని జాంబిలుగా, గ్రహంతారవాసులుగా, రెసిడెంట్ ఈవిల్ గేమ్‌లా ఉండే గెటప్‌లతో చూపించారు. ఇది నిజంగా ఘోరం..! అసలు అలాంటి ఆలోచన ఓం రౌత్‌కి రావడం దారుణం..!
అటు రాముడి పాత్రలో ప్రభాస్ లుక్‌పైనే అనేక ట్రోల్స్ నడుస్తున్నాయి! అసరు రాముడికి మీసాలు ఉండడంపైనే మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాముడిని నీలిమేఘ శ్యాముడు అంటారు. సినిమాలో ఎర్రగా, తెల్లగా రాముడిని చూపించడం రామాయణం రాసిన వాల్మికిని అవమానించినట్టే లెక్కా. ఇక ఇంటర్వెల్ తర్వాత తండ్రి దశరథ మహారాజుతో రాముడు మాట్లాడే సన్నివేశాల్లో ప్రభాస్ లుక్‌పై విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. కెరీర్‌లో ఎన్నో హిట్,ఫ్లాప్‌లు చూసిన ప్రభాస్‌పై ఇలాంటి ట్రోల్స్ ఎప్పుడూ రాలేదు. అటు కావాలనే ఓం రౌత్ ఇలా సినిమా తీశాడని.. ప్రభాస్‌ని డిగ్రేడ్ చేయడానికే ట్రోల్‌కి అవకాశమున్న లుక్స్ సినిమాలో పెట్టారని ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ వాపోతున్నారు.