MP Vivek’ : మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ రైడ్స్..
చెన్నూరులో ఎన్నికల సందర్భంగా వివేక్ డబ్బులు పంచుతున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు.

IT raids at former MP Vivek's house
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో.. మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చెన్నూరు అభ్యర్థిగా వివేక్ పోటీ చేస్తున్నారు. తాజాగా వివేక్ వెంకటస్వామి నివాసం అయిన హైదరాబాద్ లోని సోమాజిగూడలో కూడా సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు. అలాగే పార్టీ కార్యాలయంలో, బంధువుల ఇళ్లు, కూడా సోదాలు నిర్వహించారు. ఇటీవల వివేక్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.