REVANTH REDDY: కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులా..? బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు జరగవు: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌కు చెందిన తుమ్మల నాగేశ్వర రావు, బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి నివాసంతోపాటు పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై కూడా వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే, కాంగ్రెస్ నేతలపై మాత్రమే దాడులు జరుగుతుండటంపై ఆ పార్టీ నేతలు కేంద్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2023 | 03:37 PMLast Updated on: Nov 09, 2023 | 3:37 PM

It Raids On Congress Leaders Revanth Reddy Angry On Center

REVANTH REDDY: కాంగ్రెస్ (CONGRESS) నేతలపై వరుసగా ఐటీ దాడులు (IT RAIDS) జరుగుతుండటంపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (REVANTH REDDY) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా దాడుల్ని ఖండించారు. గురువారం ఉదయం నుంచి కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు కాంగ్రెస్‌కు చెందిన తుమ్మల నాగేశ్వర రావు, బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి నివాసంతోపాటు పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై కూడా వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి.

Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

అయితే, కాంగ్రెస్ నేతలపై మాత్రమే దాడులు జరుగుతుండటంపై ఆ పార్టీ నేతలు కేంద్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ట్విట్టర్ (ఎక్స్) ద్వారా రేవంత్ స్పందించారు. “నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ-కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం” అని రేవంత్ ప్రకటించారు.

MLC Kavitha : బోధన్ ర్యాలీ పాల్గొనేందుకు.. బైక్ పై వెళ్లిన ఎమ్మెల్సీ కవిత..

ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో 10 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీస్తున్న పొంగులేటి శ్రివాస్‌ రెడ్డి.. ఐటీ అధికారుల అనుమతితో గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.