Allu Arjun: మేడమ్ టుస్సాడ్స్ లో బన్నీ విగ్రహం
అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది. ఇలాంటి ఘనతను ముందుగా ప్రభాస్, మహేశ్ దక్కించుకున్నారు. ఇదే నిజమైతే.. ఈ గౌరవం అందుకుంటున్న మరో దక్షిణాది నటుడు అవుతాడు బన్నీ.

It seems that Allu Arjun's wax figure will be set up at Madame Tussauds
అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది. ఇలాంటి ఘనతను ముందుగా ప్రభాస్, మహేశ్ దక్కించుకున్నారు. ఇదే నిజమైతే.. ఈ గౌరవం అందుకుంటున్న మరో దక్షిణాది నటుడు అవుతాడు బన్నీ.
ప్రతిష్టాత్మకంగా భావించే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహం పెడుతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. విగ్రహానికి సంబంధించిన కొలతలు ఇవ్వడం కోసం బన్నీ త్వరలో లండన్ వెళ్తున్నాడని అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇదే నిజమైతే.. మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువవుతున్న మూడో తెలుగు హీరో అవుతాడు బన్నీ. తెలుగు హీరోల్లో ఇప్పటికే ప్రభాస్, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరాయి. మహేశ్ అయితే ఫ్యామిలీతో వెళ్లి తన విగ్రహంతో సెల్ఫీ దిగి వచ్చాడు. ఈతరం తొలి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఈ ఘనత సాధించాడు. మహేశ్ అందగాడుగా మేడమ్ టుస్సాడ్స్ మైనపు బొమ్మగా మారాడు. పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాదు.. ఈమధ్యనే జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కు కూడా ఈ అరుదైన గౌరవం దక్కనుంది. అయితే.. మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు అధికారికంగా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో చూడాలి.