Kamal Hassan: కమల్ కి చిరు గొంతు..

లోకనాయకుడు కమల్ హాసన్ ఒక వైపు మణిరత్నంమూవీ ప్లాన్ చేస్తూనే మరో వైపు శంకర్ భారతీయుడు 2 కి గ్లోబల్ లెవల్లో పాపులర్ అయ్యే పనులు చేస్తున్నాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 24, 2023 | 03:02 PMLast Updated on: Oct 24, 2023 | 3:02 PM

It Seems That Chiranjeevi Is Giving Voice To Kamal Haasan Bharatiyadudu 2 Which Is Being Directed By Shankar

లోకనాయకుడు కమల్ హాసన్ ఒక వైపు మణిరత్నంమూవీ ప్లాన్ చేస్తూనే మరో వైపు శంకర్ భారతీయుడు 2 కి గ్లోబల్ లెవల్లో పాపులర్ అయ్యే పనులు చేస్తున్నాడట. శంకర్ సాయంతో ఆల్రెడీ రామ్ చనణ్ ని భారతీయుడు 2 లో గెస్ట్ రోల్ చేసేలా ఒప్పించాడట కమల్ హాసన్.. ఇప్పుడు సీన్ లోకి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, అలానే బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ని రంగంలోకి దింపుతున్నాడు.

భారతీయుడు 2 ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలంటే, అంత హైప్ రావాలంటే ఏం చేయాలో అవన్నీ శంకర్ కంటే ఎక్కువగా కమలే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఇక భారతీయుడు 2 మూవీ తెలుగు వర్షన్ లో చాలా వరకు కమల్ గురించి చిరు వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడట. ఆ పాత్ర గురించి వచ్చే ప్రతీ వాయిస్ ఓవర్ కి చిరు గాత్రదానం చేయబోతున్నాడట.

ఇక తమిళ్ వర్సన్ భారతీయుడు 2 కి మాత్రం రజినీకాంత్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడని తెలుస్తోంది. హిందీ వర్షన్ కి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ చెబుతాడని తేలింది. ఇలా ఒక్కో మార్కెట్ లో ఒక్కో స్టార్ హీరో ని వాయిస్ ఓవర్ కి ఒప్పించి, భారతీయుడు 2 కి హైప్ పెంచే ప్రయత్నం మొదలైంది. ఆల్రెడీ భారతీయుడు 2 క్లైమాక్స్ లో చరణ్ గెస్ట్ రోల్ లోరావటమే కాదు, గేమ్ ఛేంజర్ కి, భారతీయుడు 2 కి సినిమాటిక్ యూనివర్స్ లా కనెక్షన్ ఉండబోతోందని తెలుస్తోంది. ఒక్కసినిమాకు ఇన్ని విశేషాలుండటంతో లెక్కే మారుతోంది.