Ram Charan: తప్పు ఎవరిది..?
దసరాకు గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సాంగ్ వస్తుంది, కనీసం అలా అయిన సంబరపడదామని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. కాని వాళ్ల ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. శంకర్ టీం మొన్నామధ్య లీకైన పాట ఒరిజినల్ వర్షన్ నే దసరా స్పెషల్ గా లాంచ్ చేయాలనుకున్నారు. కానా తమన్ ఘనకార్యం వల్లే ఈ పాట రాలేకపోతోందట.

It seems that Guntur Karam and Game Changer movie songs cannot be released for Dussehra due to Taman
దసరాకు గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సాంగ్ వస్తుంది, కనీసం అలా అయిన సంబరపడదామని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. కాని వాళ్ల ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. శంకర్ టీం మొన్నామధ్య లీకైన పాట ఒరిజినల్ వర్షన్ నే దసరా స్పెషల్ గా లాంచ్ చేయాలనుకున్నారు. కానా తమన్ ఘనకార్యం వల్లే ఈ పాట రాలేకపోతోందట.
గేమ్ ఛేంజర్ టీం నుంచి ఒక్క అప్ డేట్ రాకున్నా, కనీసం ఇప్పుడు పాటరూపంలో అప్ డేట్ వస్తోందంటే, దానికి ఫైనల్ మిక్సింగ్ చేయలేదట తమన్. దానికి కారణం గుంటూరు కారం అని తెలుస్తోంది. ఆపనుల వల్ల గేమ్ ఛేంజర్ పాట ఫైనల్ మిక్సింగ్ పూర్తికాలేదు. సరే ఇది కాకపోతే గుంటూరు కారం పనులైనా పూర్తవుతున్నాయి కాబట్టి, ఆ టీం పాట వదులుతుందా అంటే అదీలేదు.కాబట్టి మహేశ్ ఫ్యాన్స్ కి కూడా నిరాశ తప్పదు.
గుంటూరు కారం మూవీ నుంచి ఈ పండక్కి సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేయటం కన్పామ్ అని పదరోజులుగా ప్రచారం జరుగుతోంది. కాని ఇక్కడ పాట ఫైనల్ మిక్సింగ్ లో ఇబ్బందులు వచ్చాయట. ఏదో చుట్టేయటానికి గుంటూరు కారం మామూలు సినిమా కాదు. కాబట్టి తమన్ రైట్ టైం కి పాటల మిక్సింగ్ చేయకపోవటంతో, అటు మెగా ఫ్యాన్స్, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇద్దరికి నిరాశే మిగిలేలా ఉంది
కనీసం పండక్కి సలార్ ట్రైలర్ అయినా వస్తుందా? టాలీవుడ్ నుంచి ఏదైనా బిగ్ అప్ డేట్ ఈ దసరాకు వినిపిస్తుందా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా వేయిట్ చేస్తున్నారు. ఐతే ఒకవైపు ప్రభాస్ బర్త్ డే, మరోవైపు దసరా కాబట్టి ఖచ్చితంగా సలార్ ట్రైలర్ లాంచ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కాని అది జరిగేలా లేదు. ఒకవేల అలాంటిదేమైనా ఉంటే ఈపాటికే ఎనౌన్స్ మెంట్ రావలి.. దసరా దగ్గరకొచ్చింది. ఇంకా ఎనౌన్స్ మెంట్ రాలేదంటే సలార్ ట్రైలర్ 23న రావటం కేవలం గుసగుసలకే పరిమితమనుకోవాల్సి వస్తోంది.