Jr. NTR: ఐరెన్ మ్యాన్‌గా ఎన్టీఆర్
యంగ్ టైగర్ కోసం ఓ నిర్మాత కొత్త ప్లాన్ వేస్తున్నాడా... స్టార్ హీరోలను పక్కనబెట్టి మరీ దాన్ని లైన్ లో పెట్టబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి దాకా అనుకున్నది వేరు.. ఇప్పుడు చేస్తున్నది వేరు అంటూ ఫిలింనగర్ లో ఒకటే గుసగుస వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా ప్లాన్

It seems that Junior NTR, who is on the offensive with a series of films, is thinking of doing an Iron Man film
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ లో టాప్ హీరో. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో పాటు గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ట్రిపులార్ తో తారక్ క్రేజ్ నెక్ట్స్ లెవల్ కి చేరింది. తన నటనతో హాలీవుడ్ మేకర్స్ తో పాటు సినీ లవర్స్ ను ఫిదా చేశాడు. అలాంటి యంగ్ టైగర్ ప్రజెంట్ ఐదు సినిమాలతో బాక్సాఫీస్ ను దున్నేయడానికి రెడీ అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో జోరుమీదున్న యంగ్ టైగర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.
తారక్ దేవరతో పాటు ప్రశాంత్ నీల్, వార్ 2 సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న టైంలో టాలీవుడ్ బడా నిర్మాత నాగవంశీ యంగ్ టైగర్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్యాడ్ ప్రమోషన్స్ పాల్గొన్న నిర్మాత… తనకు సూపర్ హీరోల సినిమాలు అంటే ఇష్టం. టాలీవుడ్ లో అలాంటి సినిమాలు చేయాలని ఆశగా ఉందని కామెంట్స్ చేశాడు. అంతేకాక ఎన్టీఆర్ ఐరన్ మ్యాన్ తీయాలనుకుంటున్నానని తన మనసులోని మాటలను బయటకు చెప్పాడు. ఐరన్ మ్యాన్ గెటప్ కు తారక్ తగిన న్యాయం చేస్తాడని… ఎప్పటికైన తనతో అలాంటి సినిమా ఇస్తానని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ మాటలు విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.