Mahesh Babu: మహేష్ తో కాజల్ విలన్ వేశాలు
మహేష్ కోసం లేడీ విలన్ ను సెట్ చేస్తున్నాడట జక్కన్న . టాలీవుడ్ చంద్రమామ కాజల్అగర్వాల్ తో విలన్ వేశాలు వేయిస్తున్నాడట. మొదట ఈ రోల్ కోసం ఐశ్వర్య రాయ్ అప్రోచ్అవ్వగా... రిజెక్ట్ చేసిందట.

It seems that Rajamouli is looking to cast Kajal as the villain for Mahesh Babu's film
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రూమార్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఏ చిన్న పుకారు వచ్చిన క్షణాల్లో సోషల్ మీడియా మోత మోగిపోతోంది. తాజాగా బయటకొచ్చిన ఓ న్యూస్.. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ తీసుకొచ్చేలా ఉంది.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. గతంలో ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ 29పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమా కోసం మూడు టైటిల్స్‌ని లాక్ చేసి.. అందులో ఒకటి ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ టైటిల్స్ ఏంటనేది తెలియకపోయినా.. హాలీవుడ్ రేంజ్ మూవీ కాబట్టి.. ‘అవతార్’ రేంజ్‌లో ఉండేలా.. యూనివర్సల్ టైటిల్‌ను అనుకుంటున్నారట. ఇది ఇలా ఉంటే మహేష్ కోసం ఓ లేడి విలన్ నురంగంలో కి దింపుతున్నాడట జక్కన్న
ప్రజెంట్ గుంటూరు కారంతో తెగ బిజీగా ఉన్న మహేష్…. త్వరగా మూవీని కంప్లీట్ చేసి… రాజమౌళి ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారట. అందుకోసం మేకోవర్ ను మార్పుకునే పనిలో పడ్డాడు. ఇదిలా ఉంటే… మహేష్ కోసం లేడీ విలన్ ను సెట్ చేస్తున్నాడట జక్కన్న . టాలీవుడ్ చంద్రమామ కాజల్అగర్వాల్ తో విలన్ వేశాలు వేయిస్తున్నాడట. మొదట ఈ రోల్ కోసం ఐశ్వర్య రాయ్ అప్రోచ్అవ్వగా… రిజెక్ట్ చేసిందట. దీంతో కాజల్ అయితే బాగుంటుందని అప్రోచ్ అవ్వగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మగధీరలో హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ… ఇప్పుడు విలన్ గా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కాజల్ ఎంట్రీపై వినిపిస్తున్న రూమార్స్ నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.