Khalistan: ఖలిస్థానీ టెర్రరిస్టులకు షాకిచ్చిన ఇండియా
విదేశాల్లో తలదాచుకుంటే భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఖలిస్థానీ టెర్రరిస్టులకు భారత్ గవర్నమెంట్ షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది.
విదేశాల్లో తలదాచుకుంటే భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఖలిస్థానీ టెర్రరిస్టులకు భారత్ గవర్నమెంట్ షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో టెర్రర్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్న ఖలిస్థానీలు వాళ్ల బంధువులు, మద్దతుదార్ల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఏజెన్సీలకు రిపోర్ట్ కూడా అందాయట. రీసెంట్‌గా హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలతో ఖలిస్థాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఖలిస్థాన్‌ను వేరే దేశంగా ఏర్పాటు చేయాలంటూ విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాదులు విదేశాల్లో తలదాచుకుంటూ భారత్ మీద విషం చిమ్ముతున్నారు. వీళ్లకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ నుంచి నిధులు అందుతున్నట్టు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలు చేసేందుకు యువకులకు రెక్రూట్ చేసుకుని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి భారత్‌లో దాడులకు ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి టెర్రరిస్ట్‌లు. రీసెంట్‌గా విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల మీద కూడా ఈ ఉగ్రమూక దాడి చేసింది. ఈ దాడిలో పాల్గొన్న ఖలిస్థాన్ వాదులు, వాళ్లకు సహాయం చేసినవాళ్లు, వాళ్ల బంధువులు అందిరి లిస్ట్ ప్రిపేర్ చేసింది భారత్. త్వరలోనే వాళ్ల ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డులు కూడా రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో పుట్టి ఇప్పుడు విదేశాల్లో ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఈ ఉగ్రమూకను ఇక భారత గడ్డపై అడుగుపెట్టనీయకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.