T.Congress: 29 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఈ సారి ఛాన్స్ ఎవరికంటే..
కాంగ్రెస్ అభ్యర్థులను నాలుగు జాబితాల ద్వారా ప్రకటిస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఓ పక్క చేరికలు.. మరోపక్క ప్రచారంతో దూసుకుపోతోంది. ఇప్పటికే 55 మందిని ప్రకటించి ఎన్నికలకు వాళ్లను రెడీ చేస్తోంది. ఇప్పుడు మరో లిస్ట్ కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. 29 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌ను తయారు చేసింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీరువాత ఈ లిస్ట్‌ను విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ సెకండ్ లిస్ట్‌పై ఢిల్లీలో చర్చ జరుగుతోంది. పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. రేపు లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు టీపీసీసీ నేతలు. మొత్తం నాలుగు జాబితాల ద్వారా అభ్యర్థులను ప్రకటిస్తామంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆఖరి లిస్ట్‌ను నవంబర్ 3న విడుదల చేస్తామంటూ చెప్పారు. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న క్యాండెట్లను ఎంపిక చేసి బరిలో దింపుతున్నట్టు చెప్పారు. ఈసారి తెలంగాణలో అధికారంలోకి రాబోతయేది కాంగ్రెస్ పార్టీనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. రేపు రిలీజ్ కాబోయే సెకండ్ లిస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండో లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయి, ఏఏ స్థానాలకు అభ్యర్థులను కేటాయించారు అనేది ఆసక్తిగా మారింది. 55 మందితో రీసెంట్‌గా ప్రకటించిన ఫస్ట్‌లిస్ట్‌లో సీనియర్లకు పెద్దగా ప్రధాన్యం దక్కలేదు. కీలక నేతలు, కీలక నియోజకవర్గాలను కొన్నిటిని వదిలేశారు. వాటన్నిటీ సెకండ్ లిస్ట్‌లో ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరగుతోంది.
ఇప్పటికే మొదటి లిస్ట్ కారణంగా కాంగ్రెస్‌లో అసమ్మతి పెరిగింది. టికెట్ రాని నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. వాళ్లను బుజ్జగించడం ఇప్పుడు కాంగ్రెస్‌కు మరో టాస్క్‌లా మారింది. దీంతో సెకండ్ లిస్ట్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చూడాలి సెకండ్ లిస్ట్‌లో ఎవరెవరికి టికెట్లు కన్ఫాం అయ్యాయో.