Congress Second List: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా దసరా తరువాతే.. చెన్నూరులో సీపీఐకి షాక్
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఒక వైపు బస్సు యాత్రలతో ముఖ్య నాయకులు బిజీబీజీ గా గడుపుతున్నారు. ఇప్పటికే మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తుంది. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్దమౌతోంది.

It seems that the second list of Telangana Congress candidates will be announced after Dussehra.
గతంలో కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో తొలిజాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకా 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీనిని దసరా తరువాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చాలా మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈనెల 25 లేదా 26 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ సెలెక్ట్ చేసిన జాబితాలోని అభ్యర్థులతో కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడనున్నట్లు సమాచారం.
రెండవ జాబితాలో సీపీఐ, సీపీఎం పార్టీలకు రెండు స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. చెన్నూరు నుంచి సీపీఐ అభ్యర్థి బరిలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీపీఐకి తన అనుబంధ సంఘం ఏఐటీయూసీ నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ట్రేడ్ యూనియన్ సభ్యులు సీపీఐ అభ్యర్థిపై వ్యతిరేకత చూపించారు. సీపీఐ ఈ నియోజకవర్గంలో పోటీ చేయవద్దంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనికి సంబంధించి లెటర్ హెడ్ లో అందరి సంతకాలను చేసిన పత్రాన్ని విడుదల చేశారు. చెన్నూర్ నుంచి టికెట్ తీసుకునే ప్రతిపాదనను విరమించుకోవాలని మందమర్రి కార్మిక విభాగం సభ్యులు కోరారు.
T.V.SRIKAR