Sree Leela: ప్రభాస్ అనగానే అత్యాశ
ప్రభాస్ తో కలిసి నటించేందుకు శ్రీలీలా కొండంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.

It seems that young actress Srileela is getting a remuneration of 5 crores for the movie with Prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ తో జోడీకట్టే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయిన ఎగిరి గంతెస్తుంది.. శ్రీలీల మాత్రం తన రెమ్యునరేషన్ ని ఎక్కడికో ఎగరేసి, గంతెస్తోంది. సలార్ డిసెంబర్ లో రాబోతోంది. కల్కీ 2898 ఏడీ మూవీ మే 9కి రాబోతోంది. ఇక మిగిలింది మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా.
ఈ మూవీ 55 శాతం పూర్తైనా, సలార్ రిలీజ్ దగ్గరకొస్తోందని, మరే మూవీ తాలూకు అప్ డేట్స్ ఇవ్వట్లేదు. అంతవరకు ఓకే కాని, కొత్తగా వచ్చిన అప్ డేట్ ఏంటంటే, ప్రభాస్ తో కలిసి నటించేందుకు శ్రీలీలా కొండంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
సీతారామం ఫేం హను రాఘవపూడీ మేకింగ్ లో ప్రభాస్ చేయబోయే రొమాంటిక్ మూవీలో, హీరోయిన్ గా శ్రీలీలా కన్ఫామ్ అయ్యింది. ఇప్పటి వరకు కోటి పారితోషికంగా తీసుకుంటోంది. పవన్ మూవీ ఉస్తాధ్ భగత్ సింగ్, మహేశ్ గుంటూరు కారం లాంటి సినిమాలకు కోటీ తో సరిపెట్టుకున్న శ్రీలీలా, ప్రభాస్ మూవీ అనేసరికి తన పారితోషికాన్న అమాంతం 5 కోట్లకు పెంచేసింది.
పెద్ద హీరో సినిమా అనగానే రెమ్యునరేషన్లు పెంచేయటం కూడా హీరోయిన్లకు అలవాటైపోయింది. మరి పవన్, మహేశ్ సినిమాలకు పారితోషికం పెంచని శ్రీలీలా ఎందుకు ప్రభాస్ మూవీకి అంతగా పెంచిందంటే, ఈ సినిమా కోసం తను ఏకంగా 150 రోజుల డేట్స్ ఇచ్చిందట. ఆల్ మోస్ట్ 7నెలల టైం ఒకే మూవీకి ఇవ్వటం అంటే తను ఈ గ్యాప్ లో ఐదారు మూవీలు చేసుకోవచ్చు. అలా ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వటం వల్లే ఎక్కువ డిమాండ్ చేసిందని తెలుస్తోంది.