TRF Terror Attack : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడి చేసింది మేమే.. TRF
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం వేళ జమ్మూ కాశ్మీర్లోని (Jammu and Kashmir) రియాసి జిల్లాలో వైష్ణోదేవి ఆలయ (Vaishno Devi Temple) సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

It was us who did the terrorist attack in Jammu and Kashmir.. TRF
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం వేళ జమ్మూ కాశ్మీర్లోని (Jammu and Kashmir) రియాసి జిల్లాలో వైష్ణోదేవి ఆలయ (Vaishno Devi Temple) సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించిగా.. చెందగా 33 మంది తీవ్రంగా గాయపడ్డిన విషయం తెలిసిందే. జమ్మూలోని రియాసిలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద (Terror Attack) సంస్థ లష్కరే తాయిబా (ఎస్ఈటీ) వుందని తేలింది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని లష్కరే తాయిబాకు చెందిన (టీఆర్ఎఫ్) ప్రకటించింది. 12 మంది ఉగ్రవాదులు రెండు మూడు గ్రూపులుగా విడిపోయి రాజౌరి-పూంచ్ అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారు. వీరిలో పాకిస్థాన్ జాతీయులు కూడా ఉన్నారు. పాకిస్థాన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే జరిగిన ఈ ఘటన దేశంలో ఒక్కసారిగా కలకలం రేపింది.