Italian Train Accident : ఇటలీలో రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ..
ఈ రైలు ప్రమాదం ఇటలీలో జరిగింది.. ఇటలీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి ఉత్తర ఇటలీలో ఎదురెదురుగా వస్తున్న రెండు హై స్పీడ్, ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం రెండు రైళ్లు కూడా తక్కువ వేగంతో నడుస్తున్నందున ప్రమాదం ఎక్కు సంభవించలేదు.

Italian train accident.. Two passenger trains collided head on..
ప్రపంచ వ్యాప్తంగా రైలు ప్రమాదాలు తరచు భారత దేశంలో జరుగుతాయి. దురదృష్టవశాత్తు గానీ.. సిగ్నింగ్ లోపంలో గానీ.. ఆకతాయిలు చేసిన పనుల కారణంగానో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఈ మధ్య అభివృద్ధి చేందిన దేశాల్లో కూడా ఈ తరహ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదం ఎక్కడో ఎలానో చూద్దాం రండి..
ఈ రైలు ప్రమాదం ఇటలీలో జరిగింది.. ఇటలీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి ఉత్తర ఇటలీలో ఎదురెదురుగా వస్తున్న రెండు హై స్పీడ్, ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం రెండు రైళ్లు కూడా తక్కువ వేగంతో నడుస్తున్నందున ప్రమాదం ఎక్కు సంభవించలేదు. ఈ ప్రమాదం ఉత్తర ఇటలీలోని బోలోగ్నా, రిమిని మధ్య లైన్ లో ఒకే ట్రాక్ పై హై-స్పీడ్, ప్రాంతీయ రైలు ఫెన్జా నగరం, ఫోర్లి కమ్యూన్ మధ్య చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలతో బయటపడ్డారు.
ఈ రైలు ప్రమాదంపై ఇటలీ దేశ ఉప ప్రధానమంత్రి, రవాణ శాఖ మంత్రి మాటియో సాల్విని మాట్లాడుతూ తాను పరిస్థితిని సమీక్షిస్తునని, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదం ఢీకొన్న రెండు రైళ్లో హైస్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జువగా.. ఎక్స్ ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.