పేసర్లకు పండగే, గబ్బాలో మన రికార్డులివే

ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి.. ఈ బౌన్సీ వికెట్లపై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకుంటారు... ఇక ఆతిథ్య ఆసీస్ బౌలర్లయితే చెలరేగిపోతుంటారు.. అందుకే ఆసీస్ గడ్డపై కంగారూలకు ఓడించడం చాలా కష్టం... అయితే ప్రత్యర్థి జట్లలో ఉండే మంచి పేసర్లు కూడా ఆసీస్ పిచ్ లపై అదరగొడుతుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2024 | 02:10 PMLast Updated on: Dec 14, 2024 | 2:10 PM

Its A Feast For The Pacers Our Records At The Gabba

ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి.. ఈ బౌన్సీ వికెట్లపై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకుంటారు… ఇక ఆతిథ్య ఆసీస్ బౌలర్లయితే చెలరేగిపోతుంటారు.. అందుకే ఆసీస్ గడ్డపై కంగారూలకు ఓడించడం చాలా కష్టం… అయితే ప్రత్యర్థి జట్లలో ఉండే మంచి పేసర్లు కూడా ఆసీస్ పిచ్ లపై అదరగొడుతుంటారు. ఇక్కడి పిచ్ లపై మన పేసర్లకు కూడా మంచి రికార్డులే ఉన్నాయి. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న గబ్బా పిచ్ పైనా మన బౌలర్లకు చక్కని రికార్డులు నమోదయ్యాయి. ఓవరాల్ గా గబ్బా పిచ్ పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాలో శార్థూల్ ఠాకూర్ ఉన్నాడు. శార్థూల్ ఒక మ్యాచ్ ఆడి 7 వికెట్లు పడగొట్టగా…హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇక్కడ 6 వికెట్లు తీశాడు. అలాగే ఇశాంత్ శర్మ కూడా గబ్బాలో 6 వికెట్లు పడగొట్టాడు.

అటు బ్యాటింగ్ లోనూ పలువురు భారత ఆటగాళ్ళు రాణించారు. గబ్బా అనగానే రిషబ్ పంత్ ఆడిన హిస్టారికల్ ఇన్నింగ్సే గుర్తొస్తుంది. 2020-21 టూర్ లో గబ్బా వేదికగా రిషబ్ పంత్ సంచలన బ్యాటింగ్ తో జట్టును గెలిపించాడు. ఈ పిచ్ పై పంత్ 112 రన్స్ చేశాడు. ఓవరాల్ గా గబ్బాలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాను చూస్తే ఎంఎల్ జయసింహ, మురళీ విజయ్, రహానే , గంగూలీ, పుజారా ఉన్నారు. ఇక ఈ పిచ్ పై మరోసారి ఫాస్ట్ బౌలర్లే కీలకం కానున్నారు. ఊహించినట్టుగానే పేస్, బౌన్సీ వికెట్ ను సిద్ధం చేశారు. తొలి రెండు రోజులు గబ్బా పిచ్ పై పరుగులు చేయడం బ్యాటర్లకు పెద్ద సవాల్ అని క్యూరేటర్ చెబుతున్నాడు. ఓపిగ్గా ఆడకుంటే మాత్రం తక్కువ స్కోరుకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. సిరీస్ లో ఆధిక్యం పెంచుకోవాలనుకుంటున్న టీమిండియా బ్యాటర్లపైనే ఆశలు పెట్టుకుంది. జైశ్వాల్, రాహుల్, గిల్, కోహ్లీతో పాటు రోహిత్, పంత్ కూడా మంచి ఇన్నింగ్స్ లు ఆడకుంటే కష్టమే. అటు బౌలింగ్ లో మాత్రం భారత్ కు అద్భుతమైన పేస్ ఎటాక్ ఉంది. బూమ్రా, సిరాజ్ తో పాటు మూడో పేసర్ గా ఆకాశ్ దీప్ కు చోటు దక్కితే భారత త్రయం చెలరేగిపోవడం ఖాయం. అదే సమయంలో ఆసీస్ పేస్ ఎటాక్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తం మీద పేసర్లు వర్సెస్ బ్యాటర్ల సమరంగా గబ్బా మ్యాచ్ ఉండబోతోంది.