New Corona Virus : చలి పెరుగుతోంది.. జాగ్రత్త..! కొత్త కరోనా వైరస్ లక్షణాలేంటి..?

డిసెంబర్ నెలలో చలి బాగా పెరిగింది. కొత్తగా కరోనా కేసులు కూడా నమోదవుతుండటంతో జనం జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 3, 4 రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం, చలిగాలులు కూడా వీస్తుండటంతో చాలా మంది జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు. ఇదే టైమ్ లో కొత్తగా కరోనా కేసులు నమోడు అవుతుండటంతో జనం భయపడుతున్నారు. JN1 వేరియంట్ సోకకుండా మళ్ళీ మాస్కులు పెట్టుకోవడం బెటర్ అని డాక్టర్లు సూచిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 03:33 PMLast Updated on: Dec 21, 2023 | 3:33 PM

Its Getting Cold Be Careful What Are The Symptoms Of The New Corona Virus

 

డిసెంబర్ నెలలో చలి బాగా పెరిగింది. కొత్తగా కరోనా కేసులు కూడా నమోదవుతుండటంతో జనం జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 3, 4 రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం, చలిగాలులు కూడా వీస్తుండటంతో చాలా మంది జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు. ఇదే టైమ్ లో కొత్తగా కరోనా కేసులు నమోడు అవుతుండటంతో జనం భయపడుతున్నారు. JN1 వేరియంట్ సోకకుండా మళ్ళీ మాస్కులు పెట్టుకోవడం బెటర్ అని డాక్టర్లు సూచిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 3,4 రోజులుగా చలి విపరీతంగా పెరిగింది. ఏపీతో పాటు తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చల్లటి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన ఈ మార్పులతో చాలా మంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. పల్లె నుంచి నగరం దాకా హాస్పిటల్స్ లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. అందుకే వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలనీ.. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్ళకపోవడమే బెటర్ అంటున్నారు డాక్టర్లు. డిసెంబర్ మొదటి వారం నుంచే జలుబు, దగ్గు, జ్వరం బాధితుల సంఖ్య బాగా పెరిగింది. జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు డాక్టర్లు.

జ్వరం, జలుబు, గొంతు సమస్యలు పెరుగుతున్న ఈ టైమ్ లోనే కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ JN1 వల్లే కేసులు పెరుగుతున్నాయనీ.. అందరూ మళ్ళీ మాస్కులు పెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు. జ్వరం, జలుబుతో ఇబ్బంది పడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరమైతే బయటకు రావాలి. వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలి. తప్పనిసరైతేనే ప్రయాణాలు చేయాలంటున్నారు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

కరోనా కొత్త వేరియంట్ JN1 లక్షణాలు ఏంటంటే.. జ్వరం, ఒళ్ళు నొప్పులు, జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, కొందరిలో కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, వాంతులు, విరేనాలు, మరికొందరిలో శ్వాస కోశ సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగైదు రోజుల టైమ్ పడుతుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్స్ కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. గతంలో కరోనా వచ్చినప్పుడు పాటించినట్టే.. ఐసోలేషన్ లో ఉండాలి. దీనివల్ల ఇతరులకు ఆ వైరస్ సోకకుండా ఉంటుంది. మాస్కులు పెట్టుకోవాలి, శుభ్రత పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

JN1 అంత డేంజర్ ఏమీ కాదు.. ఇతర వేరియంట్స్ తో పోలిస్తే జనానికి ఎక్కువ హాని కలిగిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందుకే.. కేసులు పెరగకుండా ఉండాలంటే.. కొన్నాళ్ళ పాటు అందరూ మళ్ళీ మాస్కులు ధరించడం బెస్ట్. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే వైద్యం అందించడం వైద్య సిబ్బందికి కష్టమవుతుంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు మాస్కులు పెట్టుకోవాల్సిందే అంటున్నారు డాక్టర్లు.

JN1 కరోనా వైరస్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య, ఆరోగ్యశాఖలు అప్రమత్తం అయ్యాయి. హైదరాబాద్ లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో.. గేటెడ్ కమ్యూనిటీల్లో మాస్కులు, శానిటైజేషన్లు మళ్లీ ప్రారంభించారు. కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులను కొవిడ్ ప్రోటోకాల్ పాటించడానికి రెడీగా ఉండాలని అలర్ట్ ఇస్తున్నాయి. రోగుల కోసం PPE కిట్లు, డిస్పోజబుల్ బెడ్ షీట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ సిలెండర్లు అన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. రోజువారీ ప్రయాణాలు చేసేవారు, అయ్యప్ప భక్తులు జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ వాడటం లేదా చేతులు శుభ్రంగా కడుక్కోవడం లాంటివి చేయాలి. అనారోగ్యంగా ఉంటే ప్రయాణం చేయొద్దనీ, డాక్టర్లను సంప్రదించాలని కోరుతున్నారు. మాస్కులు పెట్టుకుంటూ.. ముందు జాగ్రత్తలు తీసుకుంటే JN1 కరోనా వేరియంట్ అంత ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు.