గబ్బాలో హాఫ్ సెంచరీ, జడ్డూ అరుదైన రికార్డ్

ఆసీస్ తో మూడో టెస్టులో భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించిన ముగ్గురిలో రవీంద్ర జడేజా ఒకడు... చాలా రోజుల తర్వాత లోయర్ ఆర్డర్ లో బ్యాట్ కు పని చెప్పి హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా జడ్డూ అరుదైన రికార్డు అందుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2024 | 03:59 PMLast Updated on: Dec 18, 2024 | 3:59 PM

Jaddus Rare Half Century At The Gabba Sets A Record

ఆసీస్ తో మూడో టెస్టులో భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించిన ముగ్గురిలో రవీంద్ర జడేజా ఒకడు… చాలా రోజుల తర్వాత లోయర్ ఆర్డర్ లో బ్యాట్ కు పని చెప్పి హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా జడ్డూ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో ఆరు, అంతకంటే ఎక్కువ 50ప్లస్ స్కోర్లు చేయడంతోపాటు 75 కంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డును నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్ లో ఇలా చేసిన మూడో క్రికెటర్ గా జడేజా నిలిచాడు. జడేజా కంటే ముందు ఈ ఘనత సాధించిన వారిలో విల్‌ఫ్రెడ్ రోడ్స్. ఇయాన్ బోథమ్ ఉన్నారు. ఇంగ్లండ్ ఆటగాడు విల్ ప్రెడ్ రోడ్స్ ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 10సార్లు 50కుపైగా పరుగులు చేసి.. 109 వికెట్లు తీశాడు. ఇయాన్ బోథమ్ ఆస్ట్రేలియాపై 10సార్లు 50పరుగుల కంటే ఎక్కువ చేసి.. 148 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాపై మొత్తం 89 వికెట్లు పడగొట్టాడు.. అదే సమయంలో ఆరు సార్లు 50కంటే ఎక్కువ పరుగులు చేశాడు.