ఎవర్రా మీరంతా ? వీడ్కోలు వార్తలకు జడేజా చెక్

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందే పలువురు సీనియర్ క్రికెటర్ల రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ మెగాటోర్నీ తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పేస్తారంటూ చాలా మంది అనుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 12:36 PMLast Updated on: Mar 12, 2025 | 12:37 PM

Jadeja Checks For Farewell News

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందే పలువురు సీనియర్ క్రికెటర్ల రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ మెగాటోర్నీ తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పేస్తారంటూ చాలా మంది అనుకున్నారు. కోహ్లీ గురించి కాకున్న రోహిత్ , జడేజా రిటైర్మెంట్ కన్ఫార్మ్ అని డిసైడపోయారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత ఈ వార్తలను రోహిత్ శర్మ ఖండించాడు. తాను ఇప్పట్లో రిటైర్ కావడం లేదంటూ క్లారిటీ వచ్చాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మ్యాచ్ జరుగుతుండగా జరిగిన ఓ ఘటనతో జడేజా రిటైర్మెంట్ పై వార్తలు గుప్పుమన్నాయి. ఫైనల్లో తన 10 ఓవర్ల స్పెల్ పూర్తయిన తర్వాత జడ్డూను విరాట్ కోహ్లీ ఎమోషనల్ గా హగ్ చేసుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. మ్యాచ్ ముగిసిన వెంటనే జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చాలా మంది అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

తాజాగా ఈ వార్తలకు జడేజా చెక్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన రిటైర్మెంట్ వస్తోన్న వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరాడు. ధన్యవాదాలు అంటూ తన ఇన్ స్టా పోస్టులో వెల్లడించాడు. గతంలో కూడా కోహ్లీని హగ్ చేసుకున్నానని, రిటైర్మెంట్ పుకార్లు పుట్టించవద్దని కోరాడు. ఇంకొన్నాళ్లు ఆడుతానని తెలిపాడు.దీంతో 2027 వరల్డ్ కప్ వరకు జడేజా క్రికెట్ ఆడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్ మ్యాచ్ చివర్లో పాండ్యా ఔటవడంతో క్రీజులోకి వచ్చిన జడేజా విన్నింగ్ షాట్ కొట్టాడు. జడేజా క్రీజులోకి వచ్చేటప్పటికీ భారత్ విజయానికి 15 బంతుల్లో 11 పరుగులు కావాలి. జడ్డూ తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్లో 4 పరుగులు చేశాడు. ఇక 7 బంతుల్లో 2 పరుగులు కావాల్సి దశలో జడ్డూ ఫోర్ బాది, ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించేశాడు. అనంతరం పుష్ప రేంజ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. జడ్డూ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు.

ఇదిలా ఉంటే 2009లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జడేజా క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 203 మ్యాచ్‌ల్లో ఆడిన జడేజా 230 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 8 వేల150 పరుగులు సాధించాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత జడేజా పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే స్వదేశంలోనే అతని రిటైర్మెంట్ ప్రకటన ఉంటుందన్నది పలువురి అభిప్రాయం. ప్రస్తుతం ఐపీఎల్ తో మరో రెండున్నర నెలల పాటు భారత్ క్రికెటర్లకు అంతర్జాతీయ సిరీస్ లు లేవు. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిడియా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్ళనుంది. ఒకవేళ జడేజా వన్డేలకు గుడ్ బై చెప్పినా టెస్ట్ క్రికెట్ లో మరికొన్నాళ్ళు కొనసాగుతాడన్న ప్రచారమూ వినిపిస్తోంది.