Jagga Reddy: మా ప్రభుత్వం కూలడానికి కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు: జగ్గారెడ్డి
మా ప్రభుత్వం కూల్చితే.. కూలాడానికి మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా..? అంతర్యుద్ధం మా పార్టీలో కాదు. హరీష్‌తో మీ పార్టీలోనే వస్తోంది చూసుకో..! కామారెడ్డిలో తోపు అనుకున్న కేసీఆర్ ఎందుకు తుస్సుమన్నాడో ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
Jagga Reddy: కూల్చితే కూలిపోవడానికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కాదని విమర్శించారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కేసీఆర్‌పై విమర్శలు చేశారు. “మా ప్రభుత్వం కూల్చితే.. కూలాడానికి మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా..? అంతర్యుద్ధం మా పార్టీలో కాదు. హరీష్‌తో మీ పార్టీలోనే వస్తోంది చూసుకో..! కామారెడ్డిలో తోపు అనుకున్న కేసీఆర్ ఎందుకు తుస్సుమన్నాడో ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రోటోకాల్ విషయంలో మేము కూడా బీఆర్ఎస్ దారిలోనే. ప్రశాంత్ రెడ్డి మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరా డబ్బులు ఉన్నాయి. రూ.60 కోట్లు పంచి గెలిచాడు.
AP ELECTIONS: సంచలన సర్వే.. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. కొత్త సర్వే సంచలనం..
నా దగ్గర 60 కోట్లు ఉంటే పట్ట పగలు చుక్కలు చూపెట్టేవాణ్ణి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అభ్యర్థి గెలిచాడు. పేద ప్రజలను మభ్యపెట్టి మీ అభ్యర్థి గెలిచాడు. నా దగ్గర 60 కోట్లు ఉంటే మీకు డిపాజిట్ కూడా వచ్చేది కాదు. ప్రశాంత్ రెడ్డి.. నీ బుర్రకు ఇప్పుడైనా ఎక్కిందా..? నేను టార్గెట్ లీడర్. ఉత్తమ్.. జగ్గారెడ్డి..రే వంత్.. శ్రీధర్.. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళం టార్గెట్ లీడర్స్ ఉన్నాం. మాలాంటి వాళ్లు ఉన్న చోట రూ.60 కోట్లు ఖర్చుపెట్టారు. మీ దగ్గర కాళేశ్వరం ఉండే.. మా దగ్గర ఏముంది అప్పులు తప్ప. హరీష్ నల్లధనం ఎక్కడ పెట్టారో సీఎంకి చెప్తా. లెక్కలు బయటకు రావాలి. 9 ఏండ్ల ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయారు..? కేసీఆర్ తోపు అంటారు కదా. తోపు ఎందుకు తుస్సు అయ్యాడు. ఎక్కువ మాట్లాడితే.. అన్నీ బయటకు తీస్తాం. మీ దగ్గర ఎమ్మెల్యేలు సీఎంని కలిసే వాళ్ళా. కేటీఆర్, హరీష్ దగ్గరికి పోయే వాళ్ళు. మల్లారెడ్డి కూడా మా దగ్గరకు రావచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు కదా. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చి తీరుతారు. మా ప్రభుత్వం పడేస్తాం అంటున్నారు మీరు. మా ప్రభుత్వాన్ని కూల్చడం అంటే.. కూలిపోయే కాళేశ్వరం కట్టినట్టు అనుకుంటున్నవా.
నాసిరకం సిమెంట్‌తో కట్టినట్టు కాదు. 130 ఏండ్ల పునాది కాంగ్రెస్‌ది. మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. జగ్గారెడ్డికి పదవులు అవసరం లేదు. నేను కాంగ్రెస్‌కి ఆయుధం. మీకు పోస్టులు ఉంటేనే లీడర్స్. నాకు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా లీడర్ అయ్యా. అంతర్యుద్ధం మా దగ్గర కాదు. మీ పార్టీలో జరిగి తీరుతుంది. మీ పార్టీలో కేసీఆర్‌కి వెన్నుపోటు పొడవడానికి హరీష్ సిద్ధంగా ఉన్నాడు. మాతో యుద్ధంకి రావడానికి ముందు ముస్లింలకు ఇస్తాం అన్న 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారా..? STల రిజర్వేషన్లు ఏమైంది..? నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదు. దానిమీద రాజకీయ దాడి చేస్తాం. మేము ఊరుకుంటామా. ప్రోటోకాల్‌లో మీరు వేసిన దారిలోనే మేము నడుస్తాం. మీరు 9 ఏండ్లు మాకు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టం. మీ అంత మూర్ఖులం కాదు. మా జాగ్రత్తలు మాకు ఉంటాయి” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.