Jaggareddy: బీఆర్ఎస్ తప్పుల్ని కప్పిపుచ్చేందుకే రేవంత్‌పై కేటీఆర్ ఆరోపణలు: జగ్గారెడ్డి
9 ఏండ్లలో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. గతం గురించి కేటీఆర్ మాట్లాడితే.. మీ గతం గురించి మాట్లాడాల్సి వస్తోంది చూసుకో. కేటీఆర్.. ఇది పద్ధతి కాదు. కేటీఆర్ తండ్రి కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు.
Jaggareddy: బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి. బుధవారం ఆయన హైదరాబాద్, గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేటీఆర్‌పై విమర్శలు చేశారు. “రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారు. న్యాయమైన పాలన బీజేపీ చేయడం లేదు కాబట్టి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తున్నారు. మోడీ పాలనలో పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోయింది. అస్సాంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం.
CM REVANTH REDDY: రేవంత్ సమాచారం లీక్.. భద్రతా సిబ్బందిలో మార్పులు
అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ.. ఒకప్పుడు కాంగ్రెస్ గూటి పక్షే. అస్సాంలో జనాలకు ఇబ్బంది లేకుండా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. కానీ అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ.. రాహుల్ గాంధీ పాద యాత్రను అడ్డుకుంటున్నారు. అస్సాంలో రాహుల్ గాంధీ గుడికి వెళ్ళడానికి అస్సాం సీఎం పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా..? అస్సాం ప్రభుత్వమే కావాలని అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తోంది. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. మోడీ దగ్గర మెప్పుకోసం బీజేపీ సిఎం.. రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నారు. రాహుల్ గాంధీ గుడికి పోవద్దా..? మోడీ మెప్పుకోసం అస్సాం సీఎం ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తోంది. బీజేపీ నేతలు ఈ మధ్యనే కండ్లు తెరిచారు. దేశం కోసం ప్రాణం ఇచ్చింది గాంధీ కుటుంబం. అలాంటి రాహుల్ గాంధీని అడ్డుకునే కుట్ర చేస్తోంది బీజేపీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారో తెలియదు. గతంలో సీఎంని mlaలు కలవాలి అంటే కుదిరేది కాదు. 9 ఏండ్లలో దక్కని అవకాశం.. సీఎం రేవంత్ రెండు నెలల్లోనే కల్పించారు. రేవంత్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా.
Pawan Kalyan: జనసేనలోకి భారీగా చేరికలు.. కీలక నేతల రాకతో బలం పెరుగుతుందా..?
9 ఏండ్లలో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. గతం గురించి కేటీఆర్ మాట్లాడితే.. మీ గతం గురించి మాట్లాడాల్సి వస్తోంది చూసుకో. కేటీఆర్.. ఇది పద్ధతి కాదు. కేటీఆర్ తండ్రి కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. మీ నాయన ఎక్కడా పని చేయకుండా ఉంటే.. రేవంత్ గురించి మాట్లాడితే బాగుంటుంది. మీ నాయన డైరెక్ట్ brsతోనే రాజకీయాలు చేశాడా కేటీఆర్. రేవంత్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఎక్కడిది. Brs చంపిన ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ బతికించింది. ప్రతిపక్ష సభ్యుల గొంతు brs నొక్కింది. కానీ మేము ప్రజాస్వామ్యం ఇస్తున్నాం. సీఎంని కలిసి తమ సమస్య చెప్పుకునే వెసులుబాటు ఇచ్చింది కాంగ్రెస్. దేవుడు పుట్టిన తర్వాత బీజేపీ పుట్టిందా.. బీజేపీ పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడా..? బీజేపీ పుట్టి 40 ఏండ్లు అవుతుంది. సీతమ్మ, శ్రీరాముడు పుట్టి 4 యుగాలు అవుతుంది. రాహుల్ గాంధీ ఇంట్లో దేవుణ్ణి మొక్కడా..? మొక్కినవి కుడా ఫోటోలు పెట్టాలా..? మోడీ సీతారాముల కల్యాణం చేస్తాడో లేదో తెలియదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా చేస్తారో లేదో తెలియదు. కానీ ప్రతీ ఏడాది నేను చేస్తా. సీతారామ కల్యాణం మోడీ చేసినట్టు ఎప్పుడైనా చూశారా?
మొన్నటి వరకు ఇన్నాళ్లు బతుకమ్మ లేదు అని కవిత బతుకమ్మ పేరుతో సినిమా చూపించింది. ఇప్పుడు మోడీ.. రామాలయం పేరుతో సినిమా చూపిస్తున్నాడు. ఇవన్నీ కొద్దీ రోజులే. బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది అనుకోవడం భ్రమ. అయోధ్య గుడికి కారకుడు అద్వానీ. దేశం అంతా తిరిగి అయోధ్యలో రామాలయం కట్టాలని ప్రచారం చేశారు. అలాంటి అద్వానీని కనీసం సన్మానించారా..? దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు. అద్వానీని సన్మానించే ఆలోచన కూడా ఎందుకు చేయలేదు. సొంత పార్టీ నాయకుడు అద్వానీ త్యాగమే గుర్తించని బీజేపీ.. మా నాయకుల త్యాగం గుర్తిస్తుందా..?” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా.. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు జగ్గారెడ్డి.