ఐసీసీలో జైషా శకం షురూ ఛైర్మన్ గా బాధ్యతల స్వీకరణ
అంతర్జాతీయ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యం ఎప్పుడూ ఉండేదే... అది ఆటలోనైనా, అడ్మినిస్ట్రేషన్ లోనైనా భారత దే పైచేయి... దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్. , శశాంక్ మనోహర్ ఇలా ఎప్పటికప్పుడు బీసీసీఐ ప్రముఖులంతా ఐసీసీలో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి భారత క్రికెట్ బోర్డు హవా మొదలైంది.
అంతర్జాతీయ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యం ఎప్పుడూ ఉండేదే… అది ఆటలోనైనా, అడ్మినిస్ట్రేషన్ లోనైనా భారత దే పైచేయి… దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్. , శశాంక్ మనోహర్ ఇలా ఎప్పటికప్పుడు బీసీసీఐ ప్రముఖులంతా ఐసీసీలో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి భారత క్రికెట్ బోర్డు హవా మొదలైంది. ఐసీసీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్ లే నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టించారు. 35 ఏళ్ల వయసులోనే ఆయన ఈ అత్యున్నత పదవిని చేపట్టారు. కాగా ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జైషాకు పలు సవాళ్ళు ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైబ్రిడ్ మోడల్ లోనే టోర్నీ నిర్వహించేందుకు నిర్ణయించినప్పటకీ పాక్ క్రికెట్ బోర్డు పలు డిమాండ్లు చేస్తోంది. వీటిపై జైషా ఎలా స్పందిస్తారనేది చూడాలి.
కాగా ఐసీసీ చైర్మన్‍గా ఎన్నికైన ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు.2019లో బీసీసీఐ కార్యదర్శిగా పదవి చేపట్టాక జై షా పేరు మార్మోగింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు కావటంతో మరింత పాపులర్ అయ్యారు. అయితే, 2009లోనే జై షా క్రికెట్ ప్రస్థానం మొదలైంది. 2009 నుంచి 2013 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు సభ్యుడిగా జై షా ఉన్నారు. 2013 నుంచి 2015 మధ్య జీసీఏ జాయింట్ సెక్రటరీగా పని చేశారు. 2015 నుంచి 2019 మధ్య బీసీసీఐ ఫైనాన్స్, మార్కెట్ కమిటీలో ఉన్నారు. 2019 అక్టోబర్‌లో బీసీసీఐ కార్యదర్శి పదవి చేపట్టారు. 2024లో ఐసీసీ చైర్మన్ అయ్యారు. 15ఏళ్ల క్రితం జీసీఏలో సాధారణ సభ్యుడిగా ఉన్న జై షా.. ఇప్పుడు ఐసీసీ టాప్ పోస్టు స్థాయికి ఎదిగారు.
బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో, ఏసీసీ అధ్యక్షుడి హోదాలో అనేక కీలక నిర్ణయాలు జైషా తీసుకున్నారు. క్రికెట్ ను బలోపేతం చేయడంలో జైషా నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయనే చెప్పొచ్చు. 2022లో ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందంతో సహా బీసీసీఐ కార్యదర్శిగా షా చెప్పుకోదగిన విజయాలు సాధించారు. ఐపీఎల్ ప్రతి మ్యాచ్ విలువ పరంగా ప్రపంచ వ్యాప్తంగా రెండో అత్యంత విలువైన క్రీడా లీగ్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జైషాకు క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.