Qatar: ఫలించిన భారత దౌత్యం.. ఖతార్‌లో భారతీయులకు మరణశిక్ష రద్దు.. భారత్ రాక..

భారత నౌకాదళానికి చెందిన మాజీ ఆఫీసర్లకు ఖతార్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. వీళ్లంతా ఖతార్‌లోని సైనికులకు, భద్రతా సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఆల్‌ దహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థలో పని చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 07:03 PMLast Updated on: Feb 12, 2024 | 7:03 PM

Jailed In Qatar Indian Navy Veterans Didnt Know They Were Coming Home

Qatar: భారత దౌత్యం ఫలించడంతో ఖతార్‌లో మరణ శిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. వీరిలో ఏడుగురు తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. భారత నౌకాదళానికి చెందిన మాజీ ఆఫీసర్లకు ఖతార్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. వీళ్లంతా ఖతార్‌లోని సైనికులకు, భద్రతా సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఆల్‌ దహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థలో పని చేస్తున్నారు. ఈ ఎనిమిది మందిని ఖతార్ ప్రభుత్వం 2022 ఆగస్టులో గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు చేసింది.

PAWAN KALYAN-KRISH: క్రిష్‌లానే ఒక్కొక్క దర్శకుడు సైడ్ అయిపోతున్నాడా?

తర్వాత విచారణ జరిపిన కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. దీంతో వీరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖతార్‌లోని తమవారిని రక్షించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు. దీంతో మోదీ సర్కారు స్పందించింది. ఖతార్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి కోర్టును భారత్ ఆశ్రయించింది. బాధితుల తరఫు వాదనలు వినకుండా ఏకపక్షంగా శిక్ష వేయడం సరికాదని వాదంచింది. దీనిపై ఖతార్ ఉన్నత న్యాయస్థానం స్పందించింది. అనేక చర్చలు, విచారణల అనంతరం ప్రభుత్వం విధించిన మరణ శిక్షను రద్దు చేసింది. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశంపై స్పందించారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్‌ 28 సదస్సులో ఖతార్‌ ఎమిర్‌షేక్ తమీమ్‌ బిన్ హమద్‌ అల్‌ థానీతో మోదీ చర్చలు జరిపారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలపై కూడా చర్చించారు. ఒకవైపు కోర్టులో విచారణ, మరోవైపు దౌత్యపరమైన మార్గాల్లో 8 మంది నేవీ మాజీ అధికారుల విడుదల కోసం భారత్ ప్రయత్నించింది. చివరకు ఖతార్ ప్రభుత్వం, కోర్టు.. భారతీయుల శిక్ష రద్దు, విడుదలకు అంగీకరించాయి.

ఈ విషయంలో భారత్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఖతార్ నుంచి విడుదలైన వారిలో కెపెన్లు సౌరభ్‌ విశిష్ఠ, నవతేజ్ గిల్, కమాండర్లు సెయిలర్‌ రాగేష్‌, సంజీవ్‌ గుప్తా, బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాలా, అమిత్‌ నాగ్‌పాల్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్‌ ఏపీకి చెందిన వ్యక్తి. తమ వారి విడుదలపై కుటుంబ సభ్యులతోపాటు భారతీయులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.