జైషా, కావ్యా పాపకు షాక్, డీప్ ఫేక్ ఫోటోలు వైరల్
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీతోనే ప్రపంచం ముందుకెళుతోంది... కానీ ఒక్కోసారి ఈ సాంకేతికత కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల పాలిట టెక్నాలజీ శాపంలా మారిపోయింది.
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీతోనే ప్రపంచం ముందుకెళుతోంది… కానీ ఒక్కోసారి ఈ సాంకేతికత కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల పాలిట టెక్నాలజీ శాపంలా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో లాభాలు ఎన్ని ఉన్నాయో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ ద్వారా డీప్ ఫేక్ ఫోటోలు సృష్టిస్తూ వాటిని వైరల్ చేస్తూ కొందరు కేటుగాళ్ళు కలకలం రేపుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు డీప్ ఫేక్ ఫోటోలకు బాధితులయ్యారు. తాజాగా కొందరు కేటుగాళ్ళు ఈ జాడ్యాన్ని క్రీడారంగానికి పాకించారు. ఇటీవల సానియామీర్జా, మహ్మద్ షమీ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు, పెళ్ళి చేసుకున్నట్టు ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వీటిలో నిజం లేదని షమీ, సానియా సన్నిహితులు స్పందిస్తే తప్ప అవి అందరూ నిజమనుకున్నారు. తాజాగా బీసీసీఐ బాస్ జైషా, సన్ రైజర్స్ ఓనర్ కావ్యామారన్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు.
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కూడా ఏఐ ఆకతాయిల బారిన పడింది. ఆమెకు సంబంధించి కూడా కొన్ని ఫేక్ ఫొటోలను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్ జై షాతో బీచ్‌లో రోమాన్స్ చేస్తున్నట్లు కొందరు ఆకతాయిలు ఫొటోలు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ ఫొటోలను క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐ డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసే టెక్నాలజీని తీసుకురావాలని కోరుతున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఏఐ డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డాడు. ఏదో బెట్టింగ్ యాప్‌కు సచిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు వీడియో రూపొందించారు. సచిన్ టీమ్ దీనిపై వివరణ ఇచ్చాకే అదంతా అవాస్తమని తేలింది.