ఐసీసీ ఛైర్మన్ గా ఆరేళ్ళు రెండు విడతల్లో జైషా బాధ్యతలు
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో మళ్ళీ భారత్ హవా మొదలైంది. శరద్ పొవార్, దాల్మియా తర్వాత ఐసీసీలో చక్రం తిప్పేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఇటీవలే ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికైన బీసీసీఐ సెక్రటరీ జైషా డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో మళ్ళీ భారత్ హవా మొదలైంది. శరద్ పొవార్, దాల్మియా తర్వాత ఐసీసీలో చక్రం తిప్పేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఇటీవలే ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికైన బీసీసీఐ సెక్రటరీ జైషా డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నాడు. జై షా రెండు విడతల్లో ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడు. ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవి మూడు విడతల్లో ఆరేళ్ల పాటు ఉండగా.. దానిలో స్వల్ప మార్పులు చేశాడు. గ్రెగ్ బార్‌క్లే స్థానంలో జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే ఐసీసీ చైర్మన్‌గా జై షా ఎన్నికవడంతో బీసీసీఐ కొత్త సెక్రటరీ రేసులో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ముందున్నట్లు తెలుస్తోంది.