ఆసీస్ తో రెండో టెస్ట్, కోహ్లీ రికార్డుపై జైశ్వాల్ కన్ను
సూపర్ ఫామ్ తో ప్రపంచ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు 2024 మరిచిపోలేని ఇయర్ గా నిలిచిపోయింది. టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి అతని విధ్వంసం కొనసాగుతూనే ఉంది.
సూపర్ ఫామ్ తో ప్రపంచ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు 2024 మరిచిపోలేని ఇయర్ గా నిలిచిపోయింది. టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి అతని విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్న జైశ్వాల్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ ను టీమిండియా నయా కింగ్ గా , కోహ్లీ వారసుడిగా అభివర్ణిస్తున్నారు. ఇటీవల పెర్త్ టెస్టులోనూ ఈ యువ ఓపెనర్ అదరగొట్టేశాడు. తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచినా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం శతక్కొట్టాడు. ఏకంగా 161 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దాంతో భారత్… ఆతిథ్య జట్టును ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ మీడియా మనోడిని పొగడ్తలతో ముంచేసింది. జైస్వాల్‌ను విరాట్ కోహ్లీతో పోల్చిన అక్కడి మీడియా అతడిని న్యూ కింగ్‌గా పేర్కొన్నాయి.
ఇక ఈ ఏడాది దుమ్మురేపుతున్న జైస్వాల్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏకంగా 700కి పైగా పరుగులు చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీసుల్లోనూ రాణించాడు. ఇలా ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో జైస్వాల్ ఇప్పటికే 1,280 రన్స్ చేశాడు. మరో 283 పరుగులు సాధిస్తే భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 2010లో సచిన్ 14 మ్యాచుల్లో 1,562 రన్స్ చేశారు. ఇండియా తరఫున ఇప్పటివరకు ఈ పరుగులే అత్యధికం. అలాగే విరాట్ కోహ్లీ పేరిట ఉన్న మరో రికార్డు కూడా జైశ్వాల్ ను ఊరిస్తోంది. ఒక ఏడాదిలో భారత టెస్ట్ విజయాల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచేందుకు జైశ్వాల్ చేరువలో ఉన్నాడు. 2016లో విరాట్ కోహ్లీ తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఏకంగా 1082 పరుగులు చేయగా.. ఇప్పుడు భారత్ గెలిచిన టెస్టుల్లో జైశ్వాల్ 995 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
అడిలైడ్ టెస్టులోనూ జైశ్వాల్ తన ఫామ్ కొనసాగించి మరో 88 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడు. కాగా 2016లోనే కోహ్లీ టెస్టుల్లో 1215 పరుగులు చేసి మోస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పటికే ఆ రికార్డును దాటేసిన జైశ్వాల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. కాగా పింక్ బాల్ టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో జైశ్వాల్ 45 రన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్ జరగనుంది.