ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు, జైశ్వాల్ వరల్డ్ రికార్డ్

భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2025 | 09:15 PMLast Updated on: Jan 04, 2025 | 9:15 PM

Jaiswal Sets World Record For Most Runs In A Single Over

భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో యశస్వి జైస్వాల్ 4 బౌండరీలు బాది 16 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ క్రమంలోనే అతను వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల రికార్డ్‌ను అధిగమించాడు. 2005లో కోల్‌కతా టెస్ట్‌లో సెహ్వాగ్ తొలి ఓవర్‌లో 13 పరుగులు చేశాడు. 2023లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ 13 పరుగులే చేసి సెహ్వాగ్ రికార్డ్ సమం చేశాడు. తాజా మ్యాచ్‌లో యశస్వి ఈ ఇద్దర్నీ అధిగమించాడు.