జలజ్ సక్సేనా నయా హిస్టరీ, కేరళ క్రికెటర్ అరుదైన రికార్డ్

రంజీ సీజన్ లో రికార్డుల మోత మోగుతోంది. తాజాగా కేరళ వెటరన్ ఆల్ రౌండర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 6 వేల పరుగులతో పాటు 400 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 37 ఏళ్ళ ఈ కేరళ క్రికెటర్ ఉత్తర్ ప్రదేశ్ తో మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 7, 2024 | 12:56 PMLast Updated on: Nov 07, 2024 | 12:56 PM

Jalaj Saxena Is A New History A Rare Record Of Kerala Cricketer

రంజీ సీజన్ లో రికార్డుల మోత మోగుతోంది. తాజాగా కేరళ వెటరన్ ఆల్ రౌండర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 6 వేల పరుగులతో పాటు 400 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 37 ఏళ్ళ ఈ కేరళ క్రికెటర్ ఉత్తర్ ప్రదేశ్ తో మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. 18 ఏళ్ళ వయసులో ఫస్ట్ క్లాస్ కెరీర్ ప్రారంభించిన జలజ్ సక్సేనా మొదట్లో మధ్యప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టు తరపున 4041 పరుగులు, 159 వికెట్లు తీశాడు. తర్వాత 2016-17 సీజన్ నుంచి కేరళకు మారిన సక్సేనా రంజీల్లో తన సూపర్ ఫామ్ కొనసాగించాడు. తాజాగా యూపీతో మ్యాచ్ లో ఐదు వికెట్ల ప్రదర్శనతోనూ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకూ 18 ప్రత్యర్థి జట్లపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించాడు.