Jamili Elections : త్వరలో కేబినెట్ ముందుకు ‘జమిలి’ నివేదిక.. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’
వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మాజీ (Former President) రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నివేదికను త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనిపై సమగ్రంగా చర్చించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100 రోజుల అజెండా సిద్ధం చేసుకోవాలని PM ఎన్నికలకు ముందే అన్ని శాఖలను ఆదేశించారు.
‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ (One Nation – One Election) నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో 2023 సెప్టెంబర్‌లో ఎనిమిది మంది నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం (Union Government) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..
వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మాజీ (Former President) రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నివేదికను త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనిపై సమగ్రంగా చర్చించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100 రోజుల అజెండా సిద్ధం చేసుకోవాలని PM ఎన్నికలకు ముందే అన్ని శాఖలను ఆదేశించారు.
దీనికనుగుణంగా జమిలి ఎన్నికల (Jamili Elections) పై న్యాయ శాఖ శాసన విభాగం ప్రణాళిక సిద్ధం చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది. లోక్‌సభతో పాటూ దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం, ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను చేపట్టాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. అంతేకాకుండా లోక్‌సభతో పాటూ దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మున్సిపాలిటీలు, పంచాయతీలు వంటి స్థానిక సంస్థల.. ఈ మూడు ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా, కార్డులను రూపొందించాలని సూచించింది. ఈ ఎన్నికలను 2029 నుంచి అమలు చేయాలని సూచించింది.
కాగా బీజేపీ 100 రోజుల ఎజెండాలో భాగంగా ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అంశంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికను త్వరలో కేబినెట్ ముందు ఉంచాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట…
జమిలి ఎన్నికలు అంటే ఏమిటి..?
భారతదేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 5 ఏళ్లు పూర్తయిన రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికలను జరుపుకొని ప్రజల మద్దతుతో పాత ప్రభుత్వం గానీ.. కొత్త ప్రభుత్వాలు కానీ కొలువుదిరుతాయి. కాగా జమిలి ఎన్నికల అంటే దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే “ఒకే దేశం – ఒకే ఎన్నిక” ఒక దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒక్క సారి రాజ్యంగా బద్దంగా ఎన్నికలు జరుగుతాయి. భారతదేశంలో మాత్రం అలా జరగడం లేదు.. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతునే ఉంటాయి. అవి లోక్ సభ గానీ.. అసెంబ్లీలో గానీ.. ఎమ్మెల్సీ గానీ.. లేదా స్థానిక సంవస్థల ఎన్నికలు గానీ.. ఇలా దేశంలో ఎదో ఒక మూలన ఎన్నికల నగారా మోగుతూనే ఉంటుంది. మరి కొన్ని సార్లు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతియ పార్టీలు గానీ.. జాతీయ పార్టీలు గానీ.. తమ ఇష్టాను సారంగా.. ఉన్న పలంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలు వెళ్తుంటారు. అందుకే జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఒత్తిడి.. ఎన్నికల నిర్వహణ గానీ పని తగ్గుతుంది. ప్ర పాలనకు అనుకూలంగా ఉంటుంది.