JANASENA: మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. నిడదవోలు నుంచి కందులు దుర్గేశ్ పోటీ..

కందుల దుర్గేశ్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి కందుల దుర్గేశ్ టిక్కెట్ విషయంలో కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది. ఆయన రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2024 | 02:37 PMLast Updated on: Mar 11, 2024 | 2:40 PM

Jana Sena Announces Kandula Durgesh As Nidadavolu Mla Candidate

JANASENA: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేశ్ పోటీ చేయబోతున్నట్లు పవన్ వెల్లడించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన చేసింది. కందుల దుర్గేశ్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. నిజానికి కందుల దుర్గేశ్ టిక్కెట్ విషయంలో కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది.

GANGSTER MARRIAGE: ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ పెళ్ళి.. 4 రాష్ట్రాల పోలీసులకు టెన్షన్

ఆయన రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టారు. కానీ, అక్కడి నుంచి టిక్కెట్ కోసం టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కూడా పోటీలో నిలబడ్డారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఈ టిక్కెట్ ఎవరికి దక్కుతుంది అనే ఆసక్తి నెలకొంది. ఎవరికి వాళ్లు టిక్కెట్ తమకే దక్కుతుందని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు కందులు దుర్గేశ్‌తో చర్చలు జరిపారు. జనసేన ప్రతిపాదనకు ఆయన అంగీకరింరు. దీంతో కందులను నిడదవోలు నుంచి బరిలో నిలుపుతున్నట్టు పార్టీ ప్రకటించింది.

ఈ నిర్ణయంతో రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయ్యినట్లే. ఇప్పుడు ఇద్దరూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున బరిలో దిగుతారు. మరోవైపు మిగతా సీట్ల సర్దుబాటు కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పేర్లను పవన్ ప్రకటించారు.